కొండముచ్చు తన్నితే ఎలా ఉంటుందో తెలుసా?

Satvika
ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎంతగా మారిందో అందరికి తెలిసిందే..స్మార్ట్ లేకున్నా అందులో సోషల్ మీడియా లేకున్నా కూడా జనాలు ఎక్కువగా ఉండలేకున్నారు..సోషల్ మీడియా లో సమాచారం తో పాటుగా కొన్ని వీడియోలు కూడా కామెడీగా ఉండటంతో జనాలు విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ కొండముచ్చు స్కూల్ విద్యార్థిని చేసిన పనికి రివెంజ్ తీర్చుకున్న ఘటన ఒకటి వైరల్ అవుతుంది. అందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..


ఏనుగులు, సింహాలు, చిరుతపులులు, కోతులు, పక్షులకు సంబంధించిన వీడియోల ను చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని సార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఈ వీడియోలు నవ్వులు పూయించడమే కాకుండా.. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పాపం.. ఓ కొండముచ్చు కు అమ్మాయిపై తెగ కోపం వచ్చేసినట్టుంది.. వెంటనే వెళ్లి ఎగిరి తన్నింది. దీంతో అమ్మాయి కింద పడిపోయింది..


ఆ వీడియోలో ఓ పాఠశాల ముందు అందరు విద్యార్థులు నిల్చుని ప్రార్దన చేస్తున్నారు. అక్కడే విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని ఉన్నారు. ఆకస్మాత్తు గా అక్కడకు వచ్చిన ఓ కొండముచ్చు ఓ వరుస చివర లో ఉన్న అమ్మాయిన దగ్గరు వెళ్లి వెనక నుంచి ఎగిరి తన్నింది. దీంతో ఆ అమ్మాయి కింద పడిపోయింది. కొండముచ్చు దాడిని చూసి అక్కడున్నవారంత షాకయ్యారు.. ఏం జరిగిందని తెరుకునేలోపే ఆ కొండముచ్చు అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియో సోషల్ మీడియా లో క్షణాల్లొ వైరల్ అయ్యింది.. మీరు ఆ వీడియో ను చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: