భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో క్యాట్ ఫిష్ కలకలం..

Satvika
ఫ్రీగా వస్తే దేన్నీ కూడా ఈ జనాలు వదలరు..అది మంచా, చెడా అంది మాత్రం పట్టించుకోరు..ఎక్కడైనా ఏదైనా పడింది అంటే మాత్రం జనాలు ఏం ఆలొచించరు.. ఎవరికైనా నష్టాలు జరిగాయా లేదా ఇంకేదైనా ప్రమాదం ఉందా అనేది చూడరు. అందులో వాళ్ళకు అనవసరమైన దానిని మాత్రం తీసుకెలతారు.మొన్నీ మధ్య బీర్ల లారీ బోల్తా పడిన విషయం తెలిసిందే..ఆ ఘటన పై సమాచారం అందుకున్న స్థానికులు మాత్రం ఎవరికీ చిక్కింధి వాళ్ళు తెచ్చుకున్నారు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో ఓ లారీ బోల్తా పడింది.


అది చేపల తో వెళుతున్న లారీ..వేరే వాహానాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో జనాలు ఒక్కసారిగా గుమిగూడి చేపలను ఖాళీ చేశారు.వివారాల్లొకి వెళితే..బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ క్రాస్ రోడ్ దగ్గర చేపల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో చేపలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. అరగంటలో చేపల లోడుని ఖాళీ చేసేశారు. అయితే, లారీ నుంచి బయటపడిన వాటిలో క్యాట్ ఫిష్ ను పోలిన చేపలు ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.


అదుపు తప్పడంతోనే లారీ బోల్తా పడింది. దొరికినవి దొరికినట్లుగా చేపలు తీసుకుని స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేపలు పూర్తిగా లూటీ అయిపోయాయి. అయితే జనాలు తమ ఇళ్లకు తీసుకెళ్లిన చాలా చేపల్లో క్యాట్ ఫిష్ ను పోలి ఉండటం ఇప్పుడు కొత్త భయాలను రేపుతోంది.మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో మాత్రం క్యాట్ ఫిష్ తింటుంటారు. ఏపీలోని కృష్ణా కారిడార్ పక్కన ఉన్న ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ ను పెంచుతూ అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. క్యాట్ ఫిష్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వీటిని తీసుకోవం వల్ల క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. దీంతో క్యాట్ ఫిష్ తినడంపై బ్యాన్ విధించారు. అయితే క్యాట్ ఫిష్ విషయం తెలియని స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. తీరా, అందులో క్యాట్ ఫిష్ ఉందని తెలిసి కంగారుపడుతున్నారు. అలాంటి చేపలను తీసుకెల్లిన వాళ్లంతా కూడా జాగ్రత్తగా వుండాలని అధికారులు కోరుతూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: