దెయ్యాల దీవి ఎక్కడ ఉందో తెలుసా..మొత్తం దెయ్యాలే..

Satvika
చుట్టూ ఇసుక మూడు వైపులా నీళ్ళు ఉండి, మధ్యలో ఒక చిన్న చిన్న ఇల్లు ఉండే వాటిని తలచుకుంటే మాత్రం అందరికి అక్కడికి ఎప్పుడూ వెలదామ అని అనుకుంటారు.కొన్ని అందంగా ఉన్నా కూడా ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి..అలాంటి ఒక దీవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం... ఆ దీవి ఇటలీలో ఉంది.. అక్కడ దెయ్యాలు ఉంటాయని అంటున్నారు..అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా..లేదా అన్న విషయం గురించి ఇప్పుడు ఒకసారి చుద్దాము..


ఇటలీ,వెనిస్, లిడో తీరంలో.. పోవెగ్లియా దీవి ఉంది. దీన్నే పిశాచాల దీవిగా పిలుస్తారు. అక్కడ మనుషులుండరు..గతంలో అక్కడ బ్లాక్ డెత్ వ్యాధి సోకిన పేషెంట్లను చిత్రహింసలు పెట్టి చంపేశారని వార్తలు. ఆ ఘటనలో 1,60,000 మంది మృత్యువాతపడ్డారట. ఆ తర్వాత ఆ దీవిపై పర్యాటకులకు అనుమతి నిషేదించారట. కానీ, వాస్తవానికి ఈ దీవులు ఎంతో అందంగా,ఆహ్లాదభరితంగా ఉండేవి. దీవి చుట్టూ నీలి రంగులో సముద్రపు నీరు కనిపిస్తుంది. అందమైన తీరాలు, దీవి మధ్యలో ఉన్న చర్చి చుట్టూ పచ్చదనం మనసుకు ప్రశాంతతనిస్తుంది..


ఒకప్పుడు జనాలను మింగెసిన బ్లాక్ డెత్ వ్యాధి తో బాధ పడేవారిని ఆ దీవిలో వుంచి సజీవదహనం చేసారని చరిత్ర చెబుతోంది..అలా మొత్తం 1,60,000 మందిని తగలబెట్టి చంపినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆ దీవిలోని మట్టిలో దాదాపు 50 శాతం బూడిద కనిపిస్తుంది. అదంతా అప్పట్లో తగలబెట్టిన మనుషులదేనని సమీప ప్రజలు చెబుతున్న మాట. యూరప్ నుంచి బ్లాక్ డెత్ వ్యాధి వెళ్లిపోయిన తర్వాత… 1900 సమయంలో అక్కడ మానసిక వికలాంగులకు కొందరు డాక్టర్లు సేవలు అందించేవారు.. అందులో ఒక డాక్టర్ మాత్రం తన రోగులను అతి కిరాతకంగా హింసలు పెట్టి చంపే వాడట.. అలా అతను ఒక ల్యాబ్ లో చేసేవాడు..ఆ ల్యాబ్ ఇప్పటికీ ఉంది.అందుకే ఆదీవికి దెయ్యాల దీవి అని పేరు పెట్టారు..అదండి ఆ దీవి కథ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: