వీళ్ళు టీచర్లా..వీధి రౌడీలా..

Satvika
ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని సామెత అందరికి తెలిసిందే..జనాలు ఇప్పుడు అలా తయారు అవుతున్నారు..అందులో కరోనా తర్వాత సామన్యుల పరిస్థితి దారుణంగా మారింది..కోటి విద్యలు కూటి కోరికే అన్న చందంగా జనాలు చాలా కష్ట పడుతున్నారు..ఒకప్పుడు వేరే ఇంట్లో ఎంగిలి పడాలి అంటే మాత్రం విపరీతమైన మోహమాటం వుండేది.కానీ ఇప్పుడు అలాంటిది లేదు.ఫ్రీగా భోజనం పెడుతున్నారు అంటే ఎవరూ ఏందీ అనేది ఉండదు.. జనం ఎగబడి దొకిరినకాడికి తింటారు..ఇలాంటి విందులో గొడవలు పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి.పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అంటే ఒకే కానీ తాజాగా ఓ పబ్లిక్ మీటింగ్ లో ఫుడ్ కోసం గొడవలకు దిగారు.


ఈ వింత ఘటన పంజాబ్‌ లో వెలుగు చూసింది.పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఒక రిసార్ట్‌లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్కూళ్ల ప్రిన్సిపల్స్‌, టీచర్లను ఏసీ బస్సుల్లో తరలించారు..ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య ఏడాది ఏడాదికి తగ్గి పోతుందని సీఎం అడిగి తెలుసుకున్నారు.పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వారి సూచనలు, సలహాలు సీఎం భగవంత్ మాన్ కోరారు. ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడ అమలు చేస్తున్న నమూనా విద్యను పంజాబ్‌లో అమలు చేస్తామని భగవంత్‌ మాన్‌ తెలిపారు.


అలాగే విద్యా సంస్కరణలకు ఉపాధ్యాయుల నుంచి సూచనలు సలహాల కోసం ఒక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా ఆయన ప్రారంభించారు.ఇంకా మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.సమావేశం అనంతరం దీనికి హాజరైన వారికి ఆ రిసార్ట్‌లో ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. దీంతో భోజనం ప్లేట్ల కోసం ప్రభుత్వ స్కూళ్ల ప్రిన్సిపల్స్‌, టీచర్లు ఎగబడ్డారు. ఆ రిసార్ట్‌కు చెందిన ఒక సిబ్బంది వరుసగా ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే అన్ని వైపుల నుంచి వచ్చిన కొందరు అందినకాడికి భోజనం ప్లేట్లను లాక్కుపోయారు.మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడ్డారు...పిల్లలను మంచి మార్గం లో నడిపించాల్సిన వీళ్ళు ఇలా కొట్టుకోవడం పై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: