కుక్కను మింగాలనుకున్న కొండ చిలువకు షాక్ ..

Purushottham Vinay
భూమి మీద వుండే విషపు జంతువులలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం, పులి లాంటి క్రూర మృగాలు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి.కుక్కలను ఇంకా పిల్లులనే కాకుండా ఏకంగా మనుషులను కూడా ఈ కొండచిలువలు సజీవంగా మింగేస్తాయి. తాజాగా కొండచిలువ వేటకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోక తప్పదు.ఇక వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుక్క కొండచిలువకు ఎరగా చిక్కినట్లు మీరు అందులో చూడవచ్చు. ఇక ఆ కుక్కను కొండచిలువ అమాంతం చుట్టేసి సజీవంగా మింగేందుకు రెడీగా ఉంటుంది. కొండచిలువ నుంచి ఎటూ తప్పించుకునే మార్గం లేక పాపం ఆ కుక్క చాలా నిస్సహాయంగా కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి ఆ కుక్క ప్రాణాలను కాపాడేందుకు వెంటనే పరుగులు తీస్తారు.

ఇక ఓ పిల్లాడు కర్రను కొండచిలువ నోటికి అడ్డం పెట్టి దాన్ని గట్టిగా పట్టుకోగా.. మరో ఇద్దరు పిల్లలు కుక్క శరీరం చుట్టూ చుట్టుకున్న ఆ కొండచిలువను అతి కష్టం మీద లాగుతారు. చివరికి 'బ్రతుకు జీవుడా' అంటూ ఆ కుక్క.. దెబ్బకు కొండచిలువ నుంచి తప్పించుకుంటుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ వీడియోను 'Animal_World' అనే ట్విట్టర్ పేజీ ట్విట్టర్ లో అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి ఆ వీడియోకు కామెంట్స్ చేస్తూ ఇంకా అలాగే లైకులు కొడుతూ చాలా హోరెత్తిస్తున్నారు. ఇక చాలామంది వ్యూయర్స్ ఆ పిల్లలు చూపించిన ధైర్యాన్ని బాగా మెచ్చుకున్నారు.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.నిజంగా ఆ పిల్లల సాహసాన్ని మేచ్చుకోలేక ఉండలేకపోతారు.


https://twitter.com/Animal_WorId/status/1484889027555864577?t=HcaVE6_RkTW13t68JQ-tsg&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: