అక్కడ నిజంగా దెయ్యాలున్నాయా?నిజమా?

Satvika
సైన్స్ ఈరోజుల్లో రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్ గా దూసుకుపోతోంది.. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలెదు.అయితే మూఢనమ్మకాలు కూడా అంతకు మించి పెరిగి పోతూన్నాయి.. ఈ మధ్య దెయ్యాలు ఉన్నాయి అంటూ కొన్ని ప్రచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.దెయ్యాలు ఉన్నాయని కొందరు బాగా నమ్ముతారు. కొందరేమో.. అసలు వాటిని నమ్మరు. ఆత్మలు, దెయ్యాలు అంటూ ఏమీ ఉండవని కొట్టి పడేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. యుకె లో కొన్ని ప్రాంతాల్లో నిజంగా దెయ్యాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అవి కెమెరాలలో బంధించారు. వివరాల్లొకి వెళితే.. యూకేకి చెందిన రిచెల్ స్టాక్స్, ఆష్లీగ్ నైస్‌బిట్ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు డార్లింగ్‌టన్‌లోని మార్పెత్‌లో బ్లాక్ అండ్ గ్రే పబ్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత నంచి వారే ఆ పబ్‌ని నడపడం మొదలు పెట్టారు. అప్పటి నుంచే వారికి కష్టాలు మొదలయ్యాయి.పబ్ లో కొన్ని రకాల వింత వింత అరుపులు రావడం, పబ్ లో వస్తువులు అవే ఎక్కడివి అక్కడ పడిపోయాయి.

మొదట్లో ఈ విషయం పై పెద్దగా పట్టించుకోలేదు. ఇకపోతే అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం భయపడటం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ అక్కాచెల్లళ్లు పబ్‌లోని మెట్లమీద నుంచి నడుస్తుంటే ఏవో వింత శబ్దం వచ్చిందని, పైగా సెల్లార్‌కి వెళ్లాలన్న భయంగా ఉందని పేర్కొన్నారు..భయంతో వాళ్ళు పోలీసులను ఆస్రయించారు.పోలీసులు ఆ పబ్‌ని తనిఖీ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఈ అక్కా చెల్లెళ్లు పోలీసుల ముందే దెయ్యాలు ఉన్నాయని చూపించేందుకు ఒక సాహసం చేశారు. ఈ క్రమంలో వాళ్లు ఒక పెన్‌ని చేతిలో పెట్టుకుని ఇక్కడ ఎవరైన ఉంటే ఈ పెన్నుని కదిలించండి అన్నారు.. వెంటనే పెన్ను కదిలింది అంతేకాదు.. కెమెరాలలో కూడా కొన్ని వింత ఆకారాలు రికార్డ్ అవ్వడం తో అది నిజమని నమ్మారు..మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: