ఐరన్ మ్యాన్ : అతని అలవాట్లను చూసి శాస్త్రవేత్తలే షాక్..!
ఇరాక్‌కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు 67 ఏళ్లకు పైగా స్నానమే చేయకపోవడం గమనార్హం. పైగా అతను పందికొక్కులు, కుందేళ్లను తింటూ, నీటి కుంటల్లో నీరు తాగుతూ జీవిస్తున్నాడు. గత 67 సంవత్సరాలుగా అతని జీవన శైలి ఇదేనట. అయితే అతని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆశ్చర్యపోవడమే కాకుండా షాక్‌కు గురయ్యారు. అదేవిధంగా అతను ఒంటరిగానే గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతాడు. చాలాకాలం అతను సొరంగంలోనే జీవించాడని సమాచారం. అయితే అతని విచిత్ర జీవన శైలిని చూసి ఆశర్యపోయిన దేజ్గా గ్రామస్తులు ఆ వృద్ధుడి కోసం ఓ పూరి గుడిసెను కూడా నిర్మించారట.
కాగా టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సంబంధించిన పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ వృద్ధునికి వైద్య పరీక్షలు చేసారు. అయితే అతను 67 ఏండ్ల కాలం నుంచి స్నానం చేయకుండా ఉన్నప్పటికీ అతని శరీరంలో ఎలాంటి పరాన్న జీవులు, బ్యాక్టీరియాలు లేవు అని అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని తేల్చారు. అయితే ఆ వృద్ధునికి స్థానిక పరిపాలనాధికారులు సైతం అండగా నిలిచారు. మరొక విశేషమేమిటంలే అతనినీ ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టవద్దంటూ అక్కడి గవర్నర్ సైతం స్వయంగా ప్రజలను కోరడం గర్వించదగ్గ విశేషం. ఆ ఐరన్ మ్యాన్‌కు ప్రభుత్వం కూడా ఎంత గౌరవం ఇస్తుందో తెలుస్తోంది.