గోదారోళ్లంటే అంతే మరీ.. ఈ మర్యాదలు చూశారా?

praveen
గోదారోళ్ళ అంటేనే మర్యాదలకు మారుపేరు అని చెబుతూ ఉంటారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు అంటే చాలు వారికి ఎక్కడ ఏమి తక్కువ కాకుండా అతిధి మర్యాదలు చేస్తూ  ఉంటారు. ఇక అలాంటిది సంక్రాంతి సమయంలో ఇంటికి చుట్టాలు వస్తే వామ్మో గోదారోళ్ళ మర్యాదలకు చూపించే ప్రేమకు ఉబ్బితబ్బిబ్బై పోవాల్సిందే. ఇక ఉభయగోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు మారుపేరుగా ఉంటాయి. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. ఇక పండక్కి కొత్త అల్లుళ్లు కూడా ఇంటికి వచ్చారు అంటే ఆ మర్యాదలు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగానే కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తమామలు ఘనంగా మర్యాదలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.Your browser does not support HTML5 video.

 అలాంటిది మర్యాదలకు మారుపేరైన గోదారోళ్ళు కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఇక మర్యాదలు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఏకంగా కాబోయే అల్లుడికి ఊహించని రేంజిలో మర్యాదలు చేశారు. గోదావరి జిల్లా నరసాపురంలో మనవరాలికి కాబోయే భర్తను ఇక సంక్రాంతి ఇంటికి పిలిచాడు ఆ అమ్మాయి తాతయ్య. ఇక మర్యాదలకు ఎక్కడ తక్కువ కాకూడదు అని అనుకున్నాడో ఏమో ఏకంగా 365 రకాల వంటకాలు చేయించి షాకిచ్చాడు. ఇంటికి వచ్చిన అల్లుడు అబ్బుర పోయేలా మర్యాదలు చేశాడు..  అల్లుడి కోసం సిద్ధం చేసిన 365 రకాల వంటలు ముందు పెట్టి ఇక పక్కన మనవరాలిని కూర్చోబెట్టి ఇక అందరూ ఒక్కో ముద్ద తినిపించడం మొదలుపెట్టారు.

 అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు.. ఇంత ఎవరైనా తింటారా సార్.. మీరు కూడా తినలేరు అంటూ డైలాగ్ చెప్పే పరిస్థితి ఇక ఆ కొత్త అల్లుడికి వచ్చింది అని చెప్పాలి. ఇక ఎన్నారై అల్లుడికి గోదారోళ్ళ మర్యాద చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి ఇక ఆ టేబుల్ మొత్తం ఎక్కడా ఖాళీ లేకుండా అన్ని వంటకాలతో నింపేశారు. 365 రకాల పిండివంటలలో అన్నం, పులిహోర, బిర్యానీ, దద్యోదనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్స్, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీమ్‌లు, 35 రకాల శీతల పానీయాలు, 15 రకాల కేకులతో.. అన్ని రకాల భోజనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: