కుక్కకు ఉన్న తెలివి మనుషులకు లేదు..నెటిజన్లు ఫిధా..

Satvika
డబ్బు పిచ్చిలో మనుషులు మానవత్వం కూడా మరచిపోయి ప్రవర్థిస్తున్నారు.. రాను రాను మనుషులు మనుషులమని కూడా మర్చిపోతున్నారు.  వాళ్ళ తో పోలిస్తే జంతువులు చాలా నయం. వాటికి ఉన్న మంచి మనసు మనుషులకు లేకుండా పోయింది.  ఇది అక్షరాల నిజం. సోషల్ మీడియా లో ఇటీవల చాలా వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలొ వైరల్ అవుతుంది.. కుక్క ఇప్పుడు అందరికీ హీరో అయ్యింది. నిజంగానే ఇది వినడానికి గ్రేట్ గా ఉంది.

తాజాగా ఓ కుక్కకు సంబంధించి న వీడియో వైరల్ అవుతోంది. దీనిలో జంతువుల కు కూడా మనుషుల తో సమానమైన భావాలు, భావోద్వేగాలు ఉంటాయని మరోసారి నిరూపిస్తుంది. అవి కూడా మనలాగే భావోద్వేగాల ను పంచుకుంటాయి. ఇక శునకం గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. విశ్వాసాని కి ప్రతీక నిలిచే జంతువుల్లో శునకాలు ముందు వరుస లో ఉంటాయి. కుక్క మానవుల కు ఎంతో దగ్గరగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటుంటారు.

అందులో భాగంగా ఒక కుక్క ఒక పిల్లవాడిని ప్రేమగా ఆలింగనం చేసుకోవడాన్ని మనం వీడియో లో చూడవచ్చు. అలిగి కూర్చున్న ఓ చిన్నారిని కుక్క ఓదార్చినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా లోని నెటిజన్ల హృదయాల ను గెలుచుకుంటుంది. వీడియో లో డాగీ చిన్నారి ని కౌగిలించుకున్న తీరు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది.. నది ఒడ్డున ఉన్న మెట్లపై కుక్క తో పాటు ఓ చిన్న పిల్లాడు కూర్చున్నట్లు వీడియో లో చూడవచ్చు. ఈ సమయం లో కుక్క తన పాదాన్ని పిల్లవాడి భుజం పై ఉంచడాని కి ప్రయత్నిస్తుంది. అలా పిల్లాడి ని కుక్క దగ్గరకు తీసుకుంటుంది.. ఈ వీడియో పై ప్రశంసలు అందుతున్నాయి. మీరు ఆ వీడియో ను చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: