వైరల్ వీడియో : పర్యాటకులపై విరిగిపడ్డ రాతి కొండ?

praveen
కాస్త సమయం దొరికింది అంటే చాలు ఎక్కడికైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు జనాలు. ఇక మొన్నటివరకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు అస్సలు అనుమతి లేకుండా పోయింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక అన్ని దేశాలు పర్యాటక ప్రాంతాల పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎంతోమంది పర్యాటక ప్రాంతాలకు వెడుతూ ఎంజాయ్ చేయడం అలవాటు ఉన్నవారు ఇంటిపట్టునే ఉంటూ ఎంతగానో నిరాశ చెందారు. ఎప్పుడెప్పుడు పర్యాటక ప్రాంతాల పై నిషేధం ఎత్తివేస్తారా.. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆశగా ఎదురు చూశారు.  కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ ప్రభావం తగ్గటంతో మళ్లీ పర్యాటకులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వాలు.

 దీంతో ఎంతో మంది తమకు నచ్చిన ప్రాంతాలకు పర్యటనకు వెళుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన చివరికి ప్రాణం తీసింది. నచ్చిన పర్యాటక ప్రాంతం లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాము అనుకుంటున్న సమయంలోనే అనుకోని ప్రమాదం దూసుకు వచ్చింది. దీంతో అప్రమత్తమయ్యేలోపే చివరికి ప్రాణం గాలిలో కలిసిపోయింది. అంతా ఆనందంగా ఉన్న సమయంలో ఊహించని ఘటన విషాదాన్ని నింపింది. ఇక ఈ ఘటనలో ఏకంగా ఆ ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఇంకొంతమందికి తీవ్రంగా గాయాలు కావడం గమనార్హం. బ్రెజిల్ లో ఈ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది.

 బ్రెజిల్ లో భారీ కొండ చరియ విరిగి పడిన ఘటనలో పర్యాటకుల ప్రాణాలు కోల్పోయారు. ఫార్నస్ సరస్సులో బోటు లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు పర్యటకులు. ఇంతలో ఊహించని విధంగా ఎత్తయిన రాతి కొండ ఒక్కసారిగా విరిగి పడిపోయింది. దీంతో ఇక ఆ కొండ చరియ విరిగి పడిన ప్రాంతం లోనే రెండు బోట్ లు ఉన్నాయ్. ఈ క్రమంలోనే ఈ రెండు బోట్ లలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. 32 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. 20 మంది గల్లంతయ్యారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియ విరిగి పడి ఉండవచ్చు అని అటు అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: