కుక్కలా మారి కోట్లు సంపాదించిన యువతి..!

Satvika
ఈరోజుల్లో డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు.. అందులో భాగంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. టిక్ టాక్ వీడియోలు కొన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫన్నీ వీడియో లు చేస్తూ చాలా మంది రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలానే సంపాదించి పేరు తెచ్చుకుంది.. అది కూడా ఒక జంతువులాగా మారి వీడియో లు చేసి కోట్లు సంపాదించింది.ఇది ఉన్న ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

ఆ యువతి జాబ్ చేస్తున్న యువతి.. అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత కుక్కలా ప్రవర్తిస్తూ విధుల వెంట తిరుగుతుంటే ఈమెకు పిచ్చా అనుకున్నారు.అయితే ప్రస్తుతం ఆమె సంపాదన చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.అంతగా ఎం చెస్తుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లొకి వెళితే.. ఆమె పేరు జెన్నా ఫిలిప్స్. సుమారు 30ఏళ్లలోపు వయసు ఉన్న ఈ యువతికి టిక్‌టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఓ రోజు కుక్కలా నటిస్తూ చిత్రీకరించిన వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోకు విపరీతమైన ఆదరణ వచ్చింది.

ఇకపై కూడా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని ఫాలోవర్లు ఆమెను కోరారు. అవసరమైతే డబ్బులు కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. దీంతో జెన్నా కీలక నిర్ణయం తీసుంది. అప్పటి వరకూ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. అంతేకాదు వీడియోల కోసం కుక్కలా నటిస్తూ వీధుల వెంబడి తిరింది. అది చూసి అంతా ముక్కన వేలేసుకున్నారు. ఈమెకు పిచ్చా.. జాబ్ వదిలేసి ఇలా చేస్తోందేంటి అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె సంపాదన చూసి, వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. కుక్కలా నటిస్తూ పోస్ట్ చేసిన వీడియోల ద్వారా జెన్నా ఇప్పటి వరకు సుమారు రూ.7కోట్లు సంపాదించిందని తెలుసుకున్న వారంతా షాక్ అవుతూన్నారు.. ఇప్పుడు ఈమెకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: