విమాన ప్ర‌యాణంలో మొబైల్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్ట‌మంటారో తెలుసా..?

N ANJANEYULU
విమాన ప్ర‌యాణం స‌మ‌యంలో మీ స్మార్ట్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ లేదా ప్లైట్ మోడ్‌లో ఉంచ‌డమే మంచిది అని విమానంలో ఉన్న సిబ్బంది సూచిస్తుంటారు. అలా ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి కార‌ణ‌మేమిటో తెలుసుకోండి. మీ స్మార్ట్ ఫోన్‌లో ఇవ్వ‌బ‌డిన ఎయిర్ ఫ్లైన్ మోడ్ లేదా ప్లై మోడ్ ఫీచ‌ర్ గురించి మీరు త‌ప్ప‌క వినే  ఉంటారు. చాలా మంది మొబైల్ యూజ‌ర్లు త‌మ‌కు వ‌చ్చే కాల్స్ కాల్ నుంచి త‌ప్పించుకునేందుకు ఈ ఆప్ష‌న్‌ను వినియోగిస్తారు. కానీ నిజ‌మైన అర్థంలో ఇది విమాన ప్ర‌యాణంలో వినియోగించేందుకు రూపొందించ‌బ‌డిన‌ది. విమాన ప్ర‌యాణ స‌మ‌యంలో ప‌రిక‌రాన్ని స్విచ్ ఆఫ్ చేయ‌డం లేదా ప్లైట్ మోడ్‌లో ఉంచ‌డం మంచిది అలా ఎందుకు చెప్పారో ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడే దీనికి కార‌ణం తెలుసుకోండి ఇలా.
సాధార‌ణంగా మొబైల్ ట‌వ‌ర్ మ‌ధ్య సిగ్న‌ల్ ప్రసార‌ముంటుంది. విమాన ప్ర‌యాణంలో కూడా ఈ రేడియో సిగ్న‌ల్స్ కొన‌సాగుతాయి. అందువ‌ల్ల ప్ర‌యాణికులు విమాన ప్ర‌యాణానికి ముందు పోన్‌ను స్విచ్ ఆఫ్ చేయ‌డం లేదా ఎయిర్‌ఫ్లేన్ మోడ్‌లో ఉంచ‌డం మంచిది. ఇలా చేసిన త‌రువాత సిగ్న‌ల్ ప్ర‌సారం ఆగిపోతుంటుంది. బ్రిటానికా వెబ్‌సైట్ ప్ర‌కారం.. చాలా ఎయిర్‌లైన్స్ ఈ రేడియో సిగ్న‌ల్‌ల ఉనికి విమానంలోని ప‌రిక‌రాలు, సెన్సార్లు నావిగేష‌న్, అనేక ఇత‌ర ముఖ్య‌మైన సిస్ట‌మ్‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని న‌మ్ముతున్న‌యి. కాబ‌ట్టి ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచ‌డం మంచిది. ఇది ప్ర‌మాదాన్ని త‌గ్గిస్తుంది.
ఆధునిక విమానంలో ఉప‌యోగించే సున్నిత‌మైన ఎల‌క్ట్రానిక్ ప‌రికరాల‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ప్ర‌భావితం చేయ‌లేని విధంగా రూపొందించిన‌ప్ప‌టికీ ఇది ముందు జాగ్ర‌త్త‌గా జ‌రుగుతుంది. బ్రిటానికా నివేదిక ప్ర‌కారం.. 2000లో స్విట్జ‌ర్లాండ్, 2003లో న్యూజిలాండ్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదాల‌కు మొబైల్ ఫోన్ ప్ర‌సార‌మే కార‌ణ‌మ‌ని భావించారు. ఇందుకు సంబంధించి చైనాలో క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు కూడా ఉన్నాయి. చైనాలోని సివిల్ ఏవియేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ విమాన ప్ర‌యాణానికి సంబంధించిన క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌ను విధించింది. ఇక్క‌డ ప్లైట్ స‌మ‌యంలో ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాన్ని ఆఫ్ చేయ‌డంలో వైఫ‌ల్యం జ‌రిమానా లేదా జైలు శిక్ష కూడా విధించ‌బడ‌తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: