తల్లికి కొడుకు గిఫ్ట్.. ఆమె ఆనందాన్ని పంచుకున్న హీరో..

Purushottham Vinay
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను ఇంకా అలాగే మంచి భవిష్యత్ ను అందించడానికి రాత్రీపగలు చాలా కష్టపడతారు.ఇక పిల్లల అభివృద్ధి కోసం వారి కోరికలు తీర్చడం కోసం తమ కనీస అవసరాలను కూడా వారు పక్కన పెడతారు.ఇక దీనికి ప్రతి ఫలంగా తమ పిల్లలు అన్నింటా కూడా సక్సెస్ అందుకోవాలని ఇంకా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అయితే తమకోసం తల్లిదండ్రుల పడిన కష్టాన్ని గుర్తు పెట్టుకుని మరి వారి పిల్లలు తల్లిదండ్రులకు సర్పరైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, మీరు ఎప్పుడైనా కాని వారి ముఖంలో చిరునవ్వు తెచ్చే పని చేశారా లేదా వారిని పూర్తిగా అనందంతో ఆశ్చర్యపరిచారా?.. అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక కొడుకు తన తల్లి పుట్టిన రోజు బహుమతిగా ఒక కొత్త ఫోన్‌ ఇచ్చి చాలా ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ కొడుకు తనకు ఇచ్చిన బహుమతిని చూసి.. ఆ తల్లి పొందిన ఆనందం ఇంకా ఆమె స్పందన అమూల్యమైనది. ఈ వీడియో క్లిప్‌ను ప్రముఖ నటుడు ఆర్ మాధవన్‌ ట్విట్టర్ లో రీట్వీట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు మరింత మంది నెటిజన్లకు చాలా బాగా చేరువైంది.
ఇక ఈ వీడియోను జనవరి 5న ట్విట్టర్ వినియోగదారుడు విఘ్నేష్ సమ్మూ ట్వీట్ చేశారు. అప్పటి నుండి ఈ వీడియో ట్విట్టర్ లో 4 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోకు తమిళంలో క్యాప్షన్ కూడా జత చేశాడు.. అది ఏమిటంటే.. "బ్యాగ్ లోపల రూ. 8800 ఫోన్ ఉంది. అయితే మా అమ్మ అనుభవించిన ఆనందానికి మాత్రం వెల లేదు." విఘ్నేష్ తన తల్లి పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి ఇది అని తెలుస్తోంది.ఇక ఈ వీడియోలో తల్లి ఒక బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు ఆ బ్యాగ్ లో కనిపించిన స్మార్ట్ ఫోన్ ను చూసిన తర్వాత ఆమె పొందిన ఆనందం అసలు మాటల్లో వర్ణించలేనిది. ఆమె స్పందన ఒక స్వచ్ఛమైన బంగారం. తన కొడుకు తనకు చాలా విలువైన వస్తువు గిఫ్ట్ గా ఇవ్వడం చూసిన తర్వాత ఆ తల్లి ప్రేమ ఆనందం ప్రతి ఒక్కరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు.. ఆ తల్లి మనసు R మాధవన్ మనసుని కూడా ఎంతగానో హత్తుకుంది. అందుకనే ఈ వీడియోని ఆయన రీ ట్విట్ చేస్తూ.. 'ఈ ఆనందానికి ధర లేదు' అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: