మరో భయంకరమైన వైరస్ వచ్చేసిందా.. మరి ఈ వీడియో ఏంటి?

praveen
మూడేళ్ల నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ అనే ప్రాణాంతకమైన మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తోంది. కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాము అని అనుకునే లోపే కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తు అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే  రోజు రోజుకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరి జీవితాలు కరోనా వైరస్ కారణంగా తలకిందులు అయిపోయాయి. ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోవడం.. ఇంకెంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయి శోకసంద్రంలో  మునిగిపోయారు. రెండేళ్లు గడిచిపోతున్న కరోనావైరస్ పీడ మాత్రం ఇంకా ప్రపంచానికి పట్టి పీడిస్తూనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలాంటి సమయంలో ఏదైనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది అంటే చాలు ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో కి వెళ్ళిపోతుంది ఇక ఇటీవల సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్  వేరియంట్ ప్రపంచదేశాలను భయపెడుతూ చాపకింద నీరులా పాకిపోతోంది అన్న విషయం తెలిసిందే.. ప్రపంచం మొత్తం ఇంకా కరోనా కోరల నుంచి బయటపడక ముందే ఇక ఇప్పుడు కొత్త వ్యాధి వచ్చినట్లు ఒక ప్రచారం ఊపందుకుంది. ఇది కరోనా వైరస్ కంటే ఎంతో ప్రమాదకరం అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలో మనిషి చేయి కనిపిస్తుంది ఇక్కడ చేయి నిండా రంధ్రాలు అందులో రక్తం వస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది.

 ఇక దీనికి సంబంధించి కొత్త వ్యాధి వచ్చింది అంటూ ఒక అందరూ భయపడిపోతున్నారు. మరింత లోతుగా సెర్చ్ చేస్తే 2017 లో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారినట్లు తేలింది. అయితే అప్పట్లో కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. అయితే అసలు  వార్త నిజమా కాదా అని క్యాటర్ క్లిప్స్ అనే వార్తా సంస్థ సర్వే నిర్వహించి అసలు విషయాన్ని బయటపెట్టింది. చేతులకు రంధ్రాలు పడి రక్తం కారుతున్న ఫోటోలు వీడియోలు నిజం కాదని ఎలాంటి కొత్త వ్యాధి రాలేదని స్పష్టం చేసింది.. ఒక మేకప్ ఆర్టిస్ట్ వేసిన హ్యాండ్ పెయింటింగ్ ఇది అంటూ క్లారిటీ ఇచ్చి అందరిలో ధైర్యాన్ని నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: