ఆవులకు బెడ్ రూమ్.. ఎక్కడో తెలుసా..!

MOHAN BABU
హిందువులు గోమాతను ఆరాధ్య దైవంగా కొలుస్తారని తెలిసిందే.నూతన గృహప్రవేశ సమయంలో ముందుగా ఆవులతోనే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇక సకల దోష నివారణకు గోమూత్రాన్ని ఇంటాబయటా చల్లడంతో పాటు   సేవిస్తారు కూడా. ఆవుపాలలో ఎన్నో సుగుణాలు ఉన్నాయని, ఆవు పేడ కూడా శ్రేయస్కరమని వైద్యులు సైతం వెల్లడించారు. ఇలా సకల దేవతలకు కొలువైన ఈ సాధు జంతువును మాత్రం గుమ్మం బయటికే పరిమితం చేశారు. కానీ రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఓ కుటుంబం మాత్రం ప్రత్యేక బెడ్ రూమ్స్ ఏర్పాటు చేసి మరీ ఆవులను  సొంత బిడ్డల మాదిరి  పెంచుకుంటున్నారు. అంతేకాదు ఆవు గొప్పతనాన్ని వివరిస్తూ ఇండియాలోనే తొలి కవ్ వ్లాగ్ ఛానల్ నిర్వహిస్తుండడం విశేషం. జోద్ పూర్ కు చెందిన సంజు కన్వర్ ఫ్యామిలీ మూడు ఆవులను సాకుతోంది. గోపి, గంగ, పృథు అనే పేర్లు గల ఈ ఆవులు..


 వాటి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బెడ్ రూమ్స్ లో హాయిగా సేదతీరుతుంటాయి. ఇక సంజు కుటుంబం cowsblike అనే యూట్యూబ్ ఛానల్ తో పాటు ఇన్ స్టా పేజీని కూడా నిర్వహిస్తోంది. ఇందులో ఆవులకు సంబంధించిన విశేషాలతో పాటు తమ ఇంట్లోని ఆవులు చేసే అల్లరిని ఫోటోలు, వీడియోల రూపంలో పంచుకుంటారు. ఇన్ స్టా పేజీకి 142 కె ఫాలోవర్స్ ఉండగా, యూట్యూబ్ కు లక్షల మంది సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. సంజు చేసిన ఓ వీడియో ఇటీవలే వైరల్ గా మారడంతో.. అతడి పెంపుడు ఆవుల గురించి లోకానికి తెలిసింది. ఇక పండుగల సమయంలో ఆవును కళ్ళజోడు తో ముస్తాబు చేసి, జోడించే కొటేషన్స్ ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఉదాహరణకు.. `కష్టపడి చదవండి మీరు కూడా కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు´ ఈ మనిషి ఎంత విచిత్రంగా ఉన్నాడు. `భూమిని మొత్తం నాశనం చేసి, ఇక మార్స్ మీద జీవితాన్ని కనుగొనేందుకు ఆరాటపడుతున్నాడు´ వంటి కొటేషన్స్ బాగా పాపులర్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: