మామిడి తోర‌ణం : ఆచారంగా క‌ట్ట‌డం ఎప్ప‌టి నుంచి ఉందో తెలుసా..?

N ANJANEYULU
మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల ప్ర‌కారం.. ఎన్నో ఆచార వ్య‌వ‌హారాల‌తో పాటు కొన్ని మొక్క‌ల‌ను సైతం దైవ స‌మానంగా భావిస్తుంటారు.  అలాంటి దేవ‌తా వృక్షాల‌కు ప్ర‌త్యేక‌మైన పూజ‌లు చేస్తూ.. వాటికి ప్ర‌త్యేక స్థానం క‌ల్పిస్తుంటారు. ఇందులో భాగంగానే.. మామిడిచెట్టును కూడా ప‌లువురు దైవ స‌మానంగా భావిస్తుంటారు. అయితే ఆ మామిడి చెట్టును దైవ స‌మానంగా భావించ‌డం మూలంగా మ‌న ఇంట్లో ఏదైనా శుభ‌కార్యం జ‌రిగినా, పండుగ‌లు జ‌రిగినా మొద‌ట‌గా మామిడి తోర‌ణాల‌నే గుమ్మానికి వేలాడ‌దీస్తుంటాం. మామిడి ఆకుల‌తో తోర‌ణాలు క‌ట్ట‌డం వ‌ల్ల  ఆ ఇంటికి పండుగ వాతావ‌ర‌ణం క‌లిగి ఉంటుంది.
మామిడి ఆకుల‌ను మ‌న జీవితంలో ప్రేమ‌కు, సంప‌ద‌కు, సంతానాభివృద్ధికి ప్ర‌తీక‌గా ఈ మూడింటిని అందించే మొక్క‌గా మామిడి చెట్టును పూజిస్తుంటారు. ముఖ్యంగా మామిడి గురించి రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణ గ్రంథాలలో కూడా ఈ మామిడి మొక్క‌ల ప్ర‌స్తావ‌న ఉన్న‌ది.  ఈ ఆకులు లేకుండా దాదాపుగా ఎటువంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌రు. ఇంత‌టి ప్రాముఖ్య‌త సంత‌రించుకున్న  మామిడి తోర‌ణాల‌ను క్రీ.శ‌. 150 కాలం నాటి అశోకుడు వేయించిన‌ సాంచి స్తూపం మీద  తోర‌ణాలతో పాటు, మామిడిపండ్ల‌ను ఎంతో అద్భుతంగా చెక్కినట్టు ఆధారాలు ఉన్నాయి. దీనిని బ‌ట్టి చూస్తుంటే.. మామిడి తోర‌ణం అనేది క్రీ.శ‌. 150 కాలం నాటి నుంచి వాడుక‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 
 మ‌న ఇంట్లో ఏదైనా శుభ‌కార్యం జ‌రిగిన‌ప్పుడు పూర్ణ‌కుంభం ఏర్పాటు చేస్తుంటాం. అయితే ఈ పూర్ణ‌కుంభాల‌ను సాక్షాత్తు ఆ భూదేవి రూపంగా భావిస్తుంటారు. ఈ పూర్ణ‌కుంభంలో మామిడి ఆకులు, కొబ్బ‌రికాయ‌లు, నీటిని వాడుతుంటారు. ఆ భ‌గ‌వంతున్ని పూజించ‌డానికి సైతం మామిడిఆకుల‌ను ఉప‌యోగిస్తుంటారు.  అదేవిధంగా ఏదైనా ర‌థం, హోమం వంటి కార్య‌క్ర‌మాల‌లో మామిడి ఆకుల‌ను వినియోగిస్తుంటారు.  ఈ విధంగా మ‌న మామిడిమొక్క‌కు ప్ర‌త్యేక స్థాన‌మే క‌ల్పించారు.  ముఖ్యంగా మామిడి వృక్షాన్ని క‌ల్ప‌వృక్షం అని కూడా పిలుస్తుంటారు. మామిడి పువ్వులో మ‌న్మ‌థుని బాణాల‌లో ఒక‌టిగా కాళిదాస్ క‌విత‌ల‌లో ఎంతో అద్భుతంగా అభివ‌ర్ణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: