వైర‌ల్ : ఈ అన్న‌ద‌మ్ముల ఫీట్ అదుర్స్‌.. గిన్నీస్ రికార్డు బ్రేక్‌..?

N ANJANEYULU

కొంత మంది ప్రాణాల‌కు తెగిస్తుంటారు. మ‌రికొంద‌రు ప్రాణం పోయినా ప‌ర్వాలేద‌ని.. రికార్డు రావాల్సిందేన‌ని అనుకుంటారు. స్పెయిన్‌లో గిరోనాలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు అదే చేసారు. అక్క‌డి సెయింట్ మేరీ కేథ‌డ్ర‌ల్‌కి ఉన్న 100 మెట్ల‌పై త‌మ ఫీట్ చేసారు. మామూలుగా ఫీట్ కాద‌ని.. చెప్పాలంటే ఓ అద్భుతం. వారెలా చేసారో మాట‌ల‌కు కూడా అంద‌నిది.


ఈ ఫీట్ చేయాల‌నుకున్న అన్న‌ద‌మ్ముల్లో అన్న త‌న త‌మ్ముడిని త‌ల‌పై రివ‌ర్స్‌లో ఉంచాడు. ఆ త‌మ్ముడు త‌ల‌ను త‌న త‌ల‌పై పెట్టుకొని, రివ‌ర్స్‌లో నిలుచోబెట్టాడు. అత‌న్నీ చేతుల‌తో ప‌ట్టుకోకుండా.. అలాగే బ్యాలెన్స్ చేస్తూ 100 మెట్ల‌ను 53 సెకండ్ల‌లో ఎక్కాడు. చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణంలో ష‌ర్ట్స్ లేకుండా వాళ్లు ఫీట్ చేసారు.
సర్కస్‌లో కూడా ఇలాంటి ఫీట్లను మనం చూడలేమ‌ని.. మన ఊర్ల‌లో..  తలపై కూరగాయల గంపనో, నీళ్ల బిందెనో మోస్తూ మహిళలు వెళ్లుతూ ఉంటారు. వాటిని వాళ్లు తలపై ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లడం మనకు ఆశ్చర్యాన్ని  కలిగిస్తున్న‌ది. అలాంటిది ఇక్కడ ఏకంగా  రివ‌ర్స్‌లో మనిషిని మోస్తూ.. మెట్లు ఎక్కుతూ వెళ్లడం ఎంత కష్టమో, అంత ప్రమాదకరం. కానీ వాళ్లు పట్టుదలతో దీనిని సాధించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్లకు త‌లొంచింది.
 వియత్నాంకి చెందిన 37 ఏళ్ల జియాంగ్ క్వోక్ కో,  32 ఏళ్ల జియాంగ్ క్వోక్ న్ఘిప్ ఈ ఫీట్ సాధించారు.  అక్కడి స్థానికులు వాళ్లు ఈ ఫీట్ చేస్తుంటే.. నరాలు తెగే ఉత్కంఠతో చూసారు.  వాస్త‌వానికి వీళ్లు ఇలా చేయ‌డం ఇదే తొలిసారి కాద‌ని.. 2016 డిసెంబ‌ర్ లో ఇలానే చేసి మొద‌టిసారి గిన్నీస్ వ‌రల్డ్ రికార్డు సాధించారు. అప్పుడు 90 మెట్ల‌ను 52 సెకండ్ల‌లో ఎక్కారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వీరి పేరునే ఉంది ఆ రికార్డు. ఇప్పుడు మ‌ళ్లీ వీళ్లే త‌మ రికార్డును తామే బ్రేకు చేసి.. కొత్త రికార్డును నెల‌కొల్పారు. పాత‌దానినే ఎవ‌రూ కూడా బ్రేకు చేయ‌లేక‌పోయారు.  ఇక కొత్త రికార్డును బ్రేకు మ‌రింత క‌ష్టంగా మారింది. ఈ రికార్డు వీరి పేరు మీద చాలా కాలం కొనసాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
ఈ సంద‌ర్భంగా జియాంగ్ క్వొక్‌కో మీడియాతో మాట్లాడారు. మేము చాలా ఆనందంగా ఉన్నామ‌ని, ప్ర‌త్యేక‌మైన దానిని సాధించాం. కేవ‌లం 53 సెక‌న్ల‌లో 100 మెట్ల‌ను అలా ఎక్కామ‌ని.. మేము ఇది చేసామంటే న‌మ్మ‌లేక‌పోతున్నట్టు వెల్ల‌డించారు. మ‌మ్మ‌ల్నీ ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తుంచుకుంటారు అని ఆశిస్తున్నాం. కొన్ని రోజుల కింద‌టి వ‌రుకూ  మేము తీవ్ర‌మైన టెన్ష‌న్ అనుభ‌వించాం అని జియాంగ్ క్వొక్‌కో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: