22 ఏండ్ల వయసున్న..8ఏండ్ల బాలికల ఉన్నది.. ఎవరో తెలుసా..!

MOHAN BABU
అమెరికాకు చెందిన షానారే  పుట్టిన ఆరు నెలలకే బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడడంతో వైద్యులు కీమోథెరపీ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే కీమోథెరపీ వల్ల పిట్యుటరీ గ్రంథికి నష్టం కలగడంతో ఆమె ఎదుగుదల ఆగిపోయిందని నిపుణులు భావిస్తున్నారు.కానీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేకపోగా.. క్యాన్సర్ చికిత్స కారణంగా కొంత మంది రోగులలో ఎండోక్రైన్ సమస్య ( చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు శరీరంలోని అన్ని జీవ ప్రక్రియలను నియంత్రిస్తుంది)లు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. దీంతో షానారే 22 ఏళ్ళు వచ్చినా,8 ఏళ్ల చిన్నారిలా కనిపిస్తోందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె లైఫ్ స్టోరీ పై అమెరికన్ టెలివిజన్ ఛానల్'టీఎల్ సి' ఐయామ్ షానారే అనే డాక్యుమెంటరీ రూపొందించింది.అతి ప్రమాదకర క్యాన్సర్ నుంచి షానా బయట పడింది. కానీ ఆమె ఎదుగుదలలో మాత్రం కొన్ని కష్టాలను తెచ్చిపెట్టింది.మూడు అడుగుల 10 అంగుళాల పొడవు మాత్రమే ఉన్న షానాను చూస్తే, 8 ఏళ్ల చిన్నారి లా కనిపిస్తుంది. కానీ ఈ యువతి పెద్దవాళ్ళల వ్యవహరించాలని కోరుకుంటుంది. బార్ లో మద్యం సేవించడం, టాటూ వేయించుకోవడం, బ్లైండ్ డేట్ కి వెళ్లడం వంటి సగటు టీనేజర్ లా వ్యవహరించాలని కోరుకుంటుండగా..

తన లుక్ వల్ల ఆ పనులను ధైర్యంగా చేయలేకపోతోంది.ఈ క్రమంలోనే ఆమె రోజు వారి కష్టాలను,షానా ప్రయాణాన్ని సమాజానికి తెలియజేసేందుకు 'టిఎల్ సి'.. ఐ యామ్ షానా రే డాక్యుమెంటరీని తీసింది. ఇటీవలే దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. షానా షో టీఎల్ సి లో జనవరి11,2022 న ప్రీమియర్ కానుంది. నన్ను చూస్తే మీరు చిన్న అమ్మాయిని అని అనుకోవచ్చు. కానీ నేను 22 ఏళ్ల మహిళను.అందరిలానే నేను కూడా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నా,స్వతంత్రంగా బతకాలని కోరు కుంటున్నాం,అందుకోసం కొంత రిస్క్ తీసుకోవాల్సిందే అని షానా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: