వచ్చే ఏడాది వాటిపై ధరలు బాదుడే బాదుడు..!!

Divya
కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆఫర్ పొందాలని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ 2022 లో మాత్రం అందరూ ఎంతో ఇష్టంగా ఉపయోగించే వాటిపై మాత్రం ధరలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రకటించింది. గత డిసెంబర్ నెల మొదటి వారంలో వంటనూనె , పెట్రోల్, డీజిల్ పై జిఎస్టి శాతాన్ని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 2022 జనవరి 1వ తేదీ నుంచి దుస్తులు, పాదరక్షల మీద ధరలు పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చింది. ఇక సామాన్య ప్రజలు అయితే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

జీఎస్టీ రేటును 5 శాతం నుండి 12 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫై చేయడంతో.. వచ్చే ఏడాది అనగా 2022 నుంచి దుస్తులు, వస్త్రాలు, పాదరక్షల ధరలు బాగా  పెరగనున్నాయి. ఈ కేటగిరీలపై పెంచిన GST రేటు జనవరి 1, 2022 నుంచి వర్తిస్తుంది అని సమాచారం. ఇకపోతే దుస్తులు , చెప్పల్స్ మీద జిఎస్టి రేటు పెంచినప్పటికీ, నిర్దిష్ట సింథటిక్ ఫైబర్‌లు, నూలుపై GST రేట్లు 18% నుంచి 12%కి తగ్గిస్తూ.. కొంతవరకు ఊరట కలిగించారు.
సెప్టెంబర్ నెలలో జరిగిన జీఎస్టీ సవరణ చేస్తూ.. దుస్తులు ,పాదరక్షలు పైన వేసే వస్తు సేవల పన్నును కూడా వివరించడం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు వస్తు సేవల పన్ను 5 శాతం ఉండగా.. 2022 జనవరి 1వ తేదీ నుంచి 5% కాస్త 12% పెరగనున్న ట్లు సమాచారం. ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా విక్రయించే వాటిపై ఈ కామర్స్ తప్పకుండా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమల సంఘం అలాగే దుస్తుల తయారీ సంఘం (CMAI) జనవరి 1 నుండి దుస్తులపై అధిక జిఎస్‌టి విధించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ M S మణి తెలిపారు.. ముడి పదార్థాలు,  ప్యాకింగ్, నూలు,  మెటీరియల్, సరుకు రవాణా ధరలతో పరిశ్రమ ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో పన్ను పెంపుదల జరిగింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: