చలికి తట్టుకోలేక బైక్ కు నిప్పు పెట్టిన దొంగ.. పోలీసులు షాక్..

Satvika
చలికి జనాలు వణికి పోతున్నారు ఇప్పటికీ చాలా మంది చలికి తట్టుకోలేక మరణించారు అనే వార్తలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి.. ఉదయం లేవగానే చలి మంట కింద జనాలు కూర్చుంటూన్నారు.  మాములుగా చలికి తట్టుకోవడానికి వేసే మంట పుల్లల తో లేదా చెత్తతో వేసుకోవడం మనం చూసే ఉంటారు. కానీ చలికి తట్టుకోలేక బైక్ ను తగలెయ్యడం ఎక్కడైనా చూశారా.. అవ్వా ఇలా కూడా చేస్తారా? వాళ్ళకు ఏమైనా పిచ్చి ఉందా అని అలొచిస్తున్నారు కదూ.. అవును మీరు విన్నది అక్షరాల నిజం..

ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక బైక్ కు నిప్పు పెట్టారు. వీడికి ఏమొచ్చింది.. ఇలా చేసాడు.. ఆగండి వివరంగా తెలుసుకుందాం.అతడు ఒక దొంగ. బైకు లను దొంగతనం చేస్తాడు. మహారాష్ట్రలోనే ఓ పట్టణం లో చాలా బైక్‌లు దొంగతనం చేశాడు. వాటినన్నింటినీ ఓ చోట దాచి పెట్టాడు. ఇప్పుడు అసలే చలికాలం కదా. ఆ దొంగకు బాగా చలివేసింది. అటూ ఇటూ చూస్తే కర్ర ముక్కలాంటివేమీ దగ్గర లో లేవు. దాంతో ఎం చేయాలో తెలియక పక్కనే వున్న బైకును తగలేసాడు.
 

వివరాల్లొకి వెళితే.. రాష్ట్రం లోని నాగ్ పూర్ లో వెలుగు చూసింది. ప్రతీ రోజు బైక్ లు చోరీ అవుతున్నాయి. తమ బైక్‌లు పోయాయంటూ పోలీసుల వచ్చే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో పోలీసులు రంగం లోకి దిగారు.. బైకులు ఎక్కడకు వెళుతూన్నాయొ అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దొంగ చెప్పిన విషయాలను విని షాక్ కు గురయ్యారు.చలికాలం కావడం తో తనకు బాగా చలివేసిందని చెప్పాడు. చలికాచుకునేందుకు అందుబాటు లో ఏమీ లేకపోవడంతో ఓ బైక్ కు నిప్పంటించి చలికాచుకున్నానని చెప్పాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి తదుపరి విచారణ చేయనున్నారు..  కాస్త వైరల్ అవ్వడంతో అందరు తెగ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: