వారెవ్వా..బుడ్డోడు తెలివికి హ్యాట్సాప్ అనాల్సిందే..

Satvika
దేశంలో రోజు రోజుకు చలి పులి తీవ్రత  ఎక్కువ అవుతుంది. చీకటి పడగానే చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు.ఉదయం 9 దాటినా కూడా ఎవరూ బయటకు రావడం లేదు.అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొవాలని హెచ్చరిస్తున్నారు. ఉదయం సాయంత్రం స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు..ఇలాంటి చలికి ప్రాణాలను రక్షించుకునెందుకు ప్రజలు చలి మంటలను వేసుకుంటూ రోజులు గడుపుతున్నారు..
ఇది ఇలా ఉండగా.. ఓ చిన్నొడు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొత్త ఆలోచన చేశాడు. చలి తగ్గించడంతోపాటు స్నానం కూడా ఒకేసారి చేసి తెలివిని ప్రదర్షిస్తూ అందరి చేత ప్రసంసలు అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్నాయి. ఆ పిల్లాడి తెలివికి యావత్ ప్రజలు ముగ్దులు అయిపొతున్నారు.

చలికి నీళ్ళను బకెట్ లో పోసుకోవటం ఆలస్యం పక్కకు వెళ్ళగానే చల్లారిపోతున్నాయి. అంత చలి మన దేశాన్ని వణికిస్తోంది. అబ్బాయి మాత్రం చలిలో కూడా ఫుల్ వేడి నీటితో స్నానం చేసేందుకు కొత్త పద్ధతి పాటించాడు. వేడి నీటిని బకెట్‌లో పోసుకుని స్నానం చేస్తే ఫలితం లేదనుకున్నట్లున్నాడు. అందుకు తీవ్రంగా ఆలోచన చేశాడు. పొయ్యిపైనే కూర్చొని స్నానం చేయడం మొదలు పెట్టాడు.

పొయ్యిపై ఒక పెద్ద టబ్ పెట్టి, అందులో నీళ్లను నింపి కింద మంట పెట్టేశాడు. ఆ వేడి నీటి పాత్రలో కూర్చొన్నాడు. కావాల్సినంత సేపు అలా అందులోనే కూర్చొని స్నానం చేస్తూ ఉండిపోయాడు. కింద మంట మండుతుంది..నిజంగా ఇలాంటి ఐడియా రావడం గ్రేట్.. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అలా చేయడం అంత సేఫ్ కాదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ కానీ అది కొంతవరకూ మాత్రమే సేఫ్.. ఇలాంటి ఎప్పుడూ ట్రై చేయకండి.. చలి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: