వీర్యంతో ఏటా 2 కోట్లు..!

N ANJANEYULU
పెంపుడు జంతువులను ప్రదర్శించడానికి ప్రతీ సంవ‌త్స‌రం వేలాది మంది జోధ్‌పూర్‌కు వస్తుంటారు. ఈ ఏడాది 1500 కిలోల బ‌రువున్న‌ భీమ్ అనే దున్నపోతు జాతరలో కనిపించడంతో దాన్ని చూసిన జ‌నాలంద‌రూ ఆశ్చర్యపోయారు. ఆ దున్నపోతు విలువ సుమారు రూ.24 కోట్లు కావ‌డం విశేషం. జోధ్ పూర్ కు వచ్చిన ఆఫ్ఘన్ షేక్ కు చెందిన అరవింద్ జాంగీద్ అనే వ్యక్తి తన గేదె కోసం రూ. 24 కోట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపాడు. కానీ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు అత‌ను. తాను దున్నపోతులను వేలం వేయడానికి జాతరకు తీసుకురాలేదు అని.. బదులుగా ముర్రా దున్నపోతుల జాతి సంరక్షణపై అవగాహన కల్పించాలని తీసుకొచ్చిన‌ట్టు  వివరించాడు.
భీమ్ 14 అడుగుల వెడ‌ల్పు, 6 అడుగుల పొడవైన దున్నపోతు అసమానమైన శరీరాకృతితో ఉన్న‌ది. నెలవారీ ఖర్చులకి దీనికోసం దాదాపు రూ.2 లక్షల అవుతుందట. భీమ్ చివరిసారిగా 2019 పుష్కర్ జాతరను సందర్శించినప్పుడు 1300 కిలోల బరువు ఉండేద‌ని, ఇప్పుడు  ఈ దున్నపోతు  1500 కిలోల బరువు కలిగి ఉండ‌డం విశేషం. కేవలం రెండేళ్ల కాలంలోనే దీని ధర రూ. 3 కోట్లు పెరిగిన‌ది. గతంలో భీమ్ విలువ రూ.21 కోట్లు కాగా ఈ ఏడాది వాల్యుయేషన్ రూ.24 కోట్లకు చేరుకుంది.
మ‌రోవైపు భీమ్ య‌జ‌మాని మాత్రం  డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి దానిని విక్ర‌యించ‌కూడ‌ద‌ని నిశ్చ‌యించుకున్నాడు. ఇప్ప‌టికే భీమ్  అనేక గౌరవాలను గెలుచుకొని విశేషంగా ఆక‌ట్టుకుంది. యజమాని అతనినీ 2018,  2019లో పుష్కర్ ఎగ్జిబిషన్ వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. అతను అసాధారణమైన గేదెను బలోత్రా నాగౌర్, డెహ్రాడూన్ లలో అనేక ఇతర ఫెయిర్లకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ భీమ్ చాలా బహుమతులు పొందడం విశేషం.
ఇక య‌జ‌మాని భీమ్ వీర్యాన్ని ప‌శువుల పెంప‌కం దారుల‌కు విక్ర‌యిస్తాడు. దీనికి ఇప్పుడు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉన్న‌ది. ఈ దున్నపోతుకు శుక్రకణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని స్పెర్మ్ నుంచి పుట్టిన దూడలు దాదాపు 40 నుంచి 50 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటాయి. అదేవిధంగా పెద్దయ్యాక రోజుకు 20 నుండి 30 లీటర్ల పాలు వ‌స్తాయి.  దాని వీర్యం యొక్క 0.25  మిల్లిలీట‌ర్లకు రూ.500 ధ‌ర  ప‌లుకుతుంది.  ప్రతి ఏడాది భీమ్ యజమాని దాదాపు 10000 యూనిట్ల వీర్యాన్ని విక్రయిస్తాడు. ఈ భీమ్ వీర్యంతోనే  సంవ‌త్స‌రానికి రూ.2కోట్ల వ‌ర‌కు సంపాదించ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: