వైరల్ వీడియో : తన వికెట్ తానే తీసుకున్న బ్యాట్స్మెన్?

praveen
అయితే క్రికెట్ లో ఎప్పుడు అరుదైన రికార్డులు క్రియేట్ చేయడానికి ఆటగాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక మైదానంలోకి దిగిన తర్వాత రికార్డులు క్రియేట్ చేయడం కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంత మంది ఆటగాళ్లు మాత్రం అరుదైన రికార్డులు క్రియేట్ చేయాలి అని భావించి చివరికి చెత్త రికార్డులను ఖాతాలో వేసుకోవడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో టీమిండియా లోకి అరంగేట్రం చేశాడు యువ బౌలర్ హర్షల్ పటేల్. అయితే ఇక మొదటి మ్యాచ్ లోనే చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

 ఏకంగా హిట్ వికెట్గా నిలిచి భారత క్రికెట్ లో హిట్ వికెట్ గా నిలిచి చెత్త రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు హర్షల్ పటేల్. ఇక ఇప్పుడు మరో ఆటగాడు కూడా ఇలా హిట్ వికెట్ గా నిలవడం గమనార్హం. ఇక ఇటీవలే ఒక స్టార్ ఆటగాడు ఏకంగా విచిత్రమైన రీతిలో వికెట్ కోల్పోవడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం వెస్టిండీస్ శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది. ఇక తొలి టెస్టులో శ్రీలంక ఆల్రౌండర్ 95 బంతుల్లో 61 పరుగులు చేసి ఎంతో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే చివరికి విచిత్రంగా వికెట్ కోల్పోయాడు శ్రీలంక ఆటగాడు ధనుంజయ డిసిల్వా.

 అతడు వికెట్ కోల్పోయిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఇక మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో 95 అవర్లో వెస్టిండీస్ బౌలర్ షానన్ గాబ్రియేల్ వేసిన బంతిని షార్ట్ ఫుడ్ పై నిలుచుని డిఫెన్స్ చేయబోయాడు ధనుంజయ డిసిల్వా.  దీంతో బంతి వేగం దిశా  మారి  వికెట్ల మీద పడేలా కనిపించింది. వెంటనే స్పందించిన బ్యాట్స్మెన్ ఇక బంతి వికెట్లకు తాగకుండా చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఏకంగా వికెట్లను కొట్టుకున్నాడు.. ఇలా తొందరపాటులో తన వికెట్ తానే తీసుకున్నాడు బ్యాట్స్మెన్. దీనికి సంబంధించిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: