వంట పాత్రలో నవ వధూవరులు...వైరల్ వీడియో !!!

Surya
కేరళ రాష్ట్రం లో కురుస్తున్న భారీ వర్షాల కారణం గా అక్కడి జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాల్లో నీరు నిండు కుండలా తయారవడం తో ప్రాజెక్ట్ గేట్ లు ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు పంపించారు. అయితే గ్రామాలన్నీ కూడా జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వచ్చి చేరిన వర్షపు నీటితో నీట మునిగాయి. గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధం లో ఉన్నాయ్. ఇలాంటి పరిస్థితులలో కేరళలో జరిగిన ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన సోమవారం రోజున అలప్పురకు సమీపంలోని తలవడిలో చోటుచేసుకుంది. తలవడి గ్రామంలో వర్షం కారణంగా గ్రామం అంతా చెరువులా తయారయ్యింది.

 దీంతో వదువరులను పెళ్లిమండపానికి తీసుకువెళ్లలేని పరిస్థితి. దింతో పెళ్ళికి వచ్చిన పెళ్లి పెద్దలు ఓ మాంచి ఆలోచన చేసి వారిద్దరిని టెంట్ సామాన్ లో వచ్చే ఓ వంట పాత్రలో వారిద్దరిని కూర్చోబెట్టి తీసుకు వెళ్లారు. పెళ్ళికి వచ్చిన వారంతా హమ్మయ్య వర్షాల కారణంగా పెళ్ళికి అంతరాయం ఏర్పడుద్దేమో అనుకున్నాం కానీ పెళ్ళికి ఏర్పడిన అంతరాయం తొలిగి పోయి పెళ్లి జరిగింది అని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ పెళ్లి కి సంబంధించి ఓ వీడియో దేశమంతా వైరల్ అయ్యింది. వరుడు ఆకాష్ వధువు ఐశ్వర్య లు ఇద్దరు కలసి ఒక వృత్తాకారపు పాత్రలో కూర్చొని ఉండగా. కేరళ పంచలు కట్టిన ఓ ఇద్దరు మనుషులు వారిని నీటిపై నుండి తరలిస్తున్నారు. అయితే వధువరుల జీవితం  వారికీ ఈ పెళ్లి గుర్తుండిపోయేలా ఫోటో గ్రాఫర్ వారి పెళ్లి తంతును చిత్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో మరియు పెళ్లి ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  


కేరళ ప్రభుత్వం ప్రస్తుతం ఈ వరద నీరు వచ్చి చేరిన ప్రాంతాలను , వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలను అంచనా వేసి వారికీ నష్టపరిహారాన్ని ఇవ్వాలని చూస్తోంది. ఏటా ఈ వర్షాలవల్ల భారీగా వర్షపు నీరు జలాశయాలతో నిండి పోతున్నాయి. అదేసమయంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి ఈ విషయమై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనుకుంటు ఉంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: