వైరల్: భర్త ప్లేట్ కడగలేదని సోషల్ మీడియాకెక్కిన భార్య !!!

Surya

గతంలో తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకునే పరిస్థితులు నేటి సమాజంలో తలెత్తుతున్నాయి. గతం లో మా అమ్మమ్మ ఇంటిపనులు , వంట పనులు ఏమాత్రం కష్టమనుకోకుండా చేసేవారు , భర్తకు సేవ చేసుకునేవాళ్ళు అని చెప్పుకునే పరిస్థితిలు నేటి సమాజంలో దాపురించాయి . దీనికి కారణం మితిమీరిన సమానత్వపు ధోరణి. అయితే కావొచ్చు కాని స్త్రీలు పురుషులకంటే అధికంగా ఇంటి శ్రమను చేస్తున్న మాట లో నిజం లేకపోలేదు ఆ విషయాన్నీ అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి కూడా. మగవారికి సమానంగా మహిళలు ఆఫీస్ కు వెళ్లి పనులు చేస్తున్నారు , సంపాదన చేస్తున్నారు. వారికీ ఇంట్లో సహాయం చేయకపోయినా పర్లేదు కానీ తాను తిన్న ప్లేటైనా తీయకపోతే ఎలా అంటూ భార్యలు సోషల్ మీడియాకు ఎక్కే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మగవారు సర్దుకు పోవాలి.




 భార్య ఒక పని చేస్తే మరో పని భర్త చేయడానికి మొహమాటపడకూడదు. ఇలా ఒకరికొకరు సహాయ సహకారాలు అందిపుచ్చుకున్నరోజే భార్య భర్తల మధ్య బంధం దృడంగా ఉంటుంది. ఆలా చేయలేని పరిస్థితులలో కనీసం భర్త తిన్న ప్లేట్ తానే తీసుకొంటే భార్యకు సహాయం చేసినవారవుతారు. లేని పక్షం లో ఇంట్లో గొడవలు తలెత్తుతాయి , ఇంకాస్త ముదిరితే సోషల్ మీడియా లు రచ్చ బండలుగా మారతాయి .ఇలాంటి ఘటనే ఇండోనేషియా లో ఓ జంట మధ్య జరిగింది. ఉద్యోగ రీత్యా ఆఫీస్ కి వెళ్లొచ్చిన భార్యకు భర్త ఇంట్లో ఉండి బాధ్యతారహితంగా తిన్న ప్లేట్ లను , వదిలిన ఇతర వస్తువములను చుసిన భార్యకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పెట్టింది. ఆ ఫొటోస్ చూసిన వారంతా ఆమె భర్తని భార్యతో మంచిగా నడచుకొమ్మని హితవు పలుకుతున్నారు. కొందరు ఈ మాత్రం దానికి భర్త పరువును నెట్టింట్లో పెట్టాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ భార్య భర్త ల మధ్య అరమరికలు లేకుంటే సంసారం సాఫీగా సాగుతుంది.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: