ఒకటి కాదు రెండు కాదు..735 గుడ్లు తలపై.. వైరల్?

praveen
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రపంచ రికార్డు సాధించడానికి ఎన్నో రకాల పాట్లు పడుతున్నారు. కాని ప్రపంచ రికార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు కదా.  ప్రపంచంలో ఉన్న అందరికంటే ప్రత్యేకమైన ప్రతిభ ఉంది అని నిరూపిస్తే ప్రపంచ రికార్డు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన ప్రతిభను కనబరిచడానికి ఎంతోమంది ఎన్నో ఏళ్ల నుంచి తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. చివరికి గిన్నిస్ బుక్ లో తమ పేరుని లిఖించు కొని   ప్రపంచ రికార్డును సాధిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఎంతోమంది ఇలా ప్రపంచ రికార్డును సాధించడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు.

 ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి ఒక విచిత్రమైన పనులు చేసి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించారు అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.  మామూలుగా అయితే తలపై ఎవరైనా కోడిగుడ్లు పెట్టుకుంటారా.. అలాగే నిలబడగలుగుతారా.. అది అసాధ్యం అని చెప్పాలి కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం నెత్తి పై కోడిగుడ్లు పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాదు వాటిని బ్యాలెన్స్ కూడా చేసాడు.  ఇక ఇలా నెత్తిపై కోడిగుడ్లను పెట్టుకొని ఏకంగా ప్రపంచ రికార్డును కొల్లగొట్టాడు సదరు వ్యక్తి. అదేంటి నెత్తి పై కోడిగుడ్లు పెట్టుకుంటే ప్రపంచ రికార్డ్ కొట్టవచ్చా అని ఆశ్చర్య పోతున్నారు కదా. అతడు నెత్తిపై పెట్టుకుంది ఒకటో రెండో కోడిగుడ్లు కాదు ఏకంగా 735 కోడిగుడ్లు తలపై పెట్టుకున్నాడు.

 షాక్ అవుతున్నారు కదా.. కానీ ఇది నిజమే.. ఏకంగా 735 కోడిగుడ్లను తలపై మోసి ప్రపంచ రికార్డును సాధించాడు ఇక్కడ ఒక వ్యక్తి. వెస్ట్ ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఇలా రికార్డు కొట్టాడు గ్రెగరీ డిసిల్వ అనే వ్యక్తి తన టోపీ లో అత్యధిక గుడ్లు మోసాడు అంటూ ఇటీవలే గిన్నీస్ వరల్డ్ రికార్డు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. అంతేకాదు ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. అతని టోపీ కి గుడ్లను అతికించేందుకే మూడు రోజుల సమయం పట్టింది అంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెలిపింది. ఇక దీనికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయగా ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.  ఏకంగా 735 గుడ్లను కొండను మోస్తున్నట్లుగా సదరు వ్యక్తి మోస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: