వైరల్: అనవసరంగా కంప్యూటర్ చూస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు..!

Divya
సాధారణంగా ప్రస్తుత కాలంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఏ పని చేయాలి అన్న మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ను వాడాల్సిందే. ఇక ఇటీవల కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాస్ పేరిట పిల్లలు కూడా కంప్యూటర్ ముందు కూర్చొక తప్పడం లేదు. అంతేకాదు ఆఫీస్ వర్క్ మొదలుకొని వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికి కంప్యూటర్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చుంటారో వారికి విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా వస్తుందట.

ముఖ్యంగా కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి తో పాటు చుట్టుపక్కల వెలుతురు కూడా కళ్ళ మీద పడడం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అంతేకాదు తీవ్రమైన తలనొప్పి, కంటి నొప్పి ,కళ్ళు ఎర్రబారడం, వెన్నునొప్పి, మెడనొప్పి, భుజంనొప్పి వంటి ఎన్నో రకాల సమస్యలను మనం అనుభవించాల్సి ఉంటుందట. అంతే కాదు కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తడం వల్ల కంటి చూపు మందగిస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు..అవేంటో  ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం..

కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు స్క్రీన్ నుంచి కళ్ళు మారుస్తూ ఉండాలి.. ఇక కంటిరెప్పలు కొడుతూ ఉండాలి. చూపులు కూడా ప్రతిసారి పక్కకు తిప్పుతూ ఉండటం వల్ల కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి నుంచి కళ్ళను కాపాడుకోవచ్చు.
అంతేకాదు కళ్ళకు అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కళ్ళు గట్టిగా మూసి ఊపిరితిత్తులు ద్వారా గట్టిగా గాలిని పీల్చి వదలాలి. ఇలా చేయడం వల్ల కంటి నొప్పి కూడా దూరం అవుతుంది.
చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి , వెలుతురు వచ్చేలాగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే కంప్యూటర్ చూడడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: