వైరల్:దోమకాటు వల్ల వచ్చే విష జ్వరాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?

Divya
కరోనా మహమ్మారి భయంతో ప్రజలు ఇంకా తేరుకోకముందే.. డెంగ్యూ రూపంలో మరొక విష వ్యాధి విలయతాండవం చేస్తున్నది. ఇప్పుడు వర్షాకాలం కావున ఈ వ్యాధి బారిన చాలామంది పడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే డెంగ్యూ కేసులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఈ విషజ్వరంతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ జ్వరం ఏడీస్ అనే దోమ కాటు వలన ఈ వ్యాధి ఎక్కువగా పెరుగుతూ వస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, భయంకరమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు ఇవే కాకుండా మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.. ఇకపోతే డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం..
1). ముందుగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి తగినంత విశ్రాంతి అవసరం.
2). ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలి. పళ్లరసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ లాంటి రసాలు తీసుకోవడం వల్ల మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వీటివల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి
3). ఈ విష జ్వరం వచ్చిన వారు ఎక్కువగా నారింజ, ఉసిరి ,పైనాపిల్ వంటి సిట్రస్ జాతి పండ్లను తినాలి. ఇక ముఖ్యంగా కూరగాయలకు సంబంధించి జ్యూస్ లను మర్చిపోకూడదు.
4). ఇక ఈ జ్వరం వచ్చినప్పుడు చపాతీలు, ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్ వంటి పదార్థాలు తినకూడదు. తినడం వల్ల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.
5). గోధుమల నుండి వచ్చిన గడ్డి రసం ను ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటే ఎండకి వచ్చి విటమిన్ డి తీసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఉదయం 9 గంటల లోపు వచ్చే సూర్యరశ్మిని మాత్రమే మన శరీరం గ్రహించేలా చూసుకోవాలి.. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే త్వరగా డెంగ్యూ నుంచి కోలుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: