వైరల్: ఎగ్ దోశకు డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న బీ టెక్ స్టూడెంట్..!

Divya

క్షణికావేశం.. ప్రాణాలను కూడా తీసుకునేలా చేస్తుంది అన్న విషయం తెలిసినప్పటికీ , ఈ కాలంలో యువత ఎందుకు వినడం లేదో.. అర్థం కావడం లేదు.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత,  చిన్న చిన్న విషయాలకు కూడా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. జీవితం ఒక రంగుల ప్రపంచం అని తెలిసినప్పటికీ , దానిని చిన్న చిన్న కారణాల వలన అర్థంతరంగా మధ్యలోనే ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఇక సాధారణంగా మనిషి చావుకు ఎన్నో కారణాలు వుంటాయి. ఇక కుటుంబ కలహాలు,ఆరోగ్య సమస్యలు ,  ఆర్థిక ఇబ్బందులు వంటి పలు కారణాలతో జీవితంపై విరక్తి చెంది,  కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు.
ఇకపోతే ఇటీవల ఒక బీటెక్ విద్యార్థి ఎగ్ దోశ కు తన తల్లి డబ్బులు ఇవ్వలేదని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే చంద్రగిరి నియోజకవర్గం.. పాకాల మండలంలోని  తలారివారిపల్లికి చెందిన దివంగత రమణయ్య కుమారుడు సాయి కిరణ్ (21)  బి.కోత్తకోట దగ్గరలో లోని వేము అనే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.. ఇటీవల తన తల్లిని ఎగ్ దోశ కు డబ్బులు ఇవ్వమని అడిగాడట. కానీ ఆమె లేవని చెప్పడంతో ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఆకలి వేస్తే ఇంటికి వస్తాడు అనుకొని సాయి కిరణ్ తల్లి పట్టించుకొలేదు..ఇక తన గ్రామానికి దగ్గరలో వున్న  గుర్రప్పకుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక అక్కడే  సమీపంలో పొలం పనులు చేస్తున్న  కొంతమంది వ్యక్తులు గమనించి కేకలు వేస్తుండగానే.. కుంటలో దూకాడు. ఇక అప్రమత్తమైన కూలీలు వెంటనే సాయి కిరణ్‌ను కాపాడడానికి  ప్రయత్నించినా ఫలితం లభించలేదు. అప్పటికే సాయి కిరణ్ మృతి చెందాడు. ఇక  కిరణ్ డెడ్ బాడీ ని పోస్ట్ మార్టం కి పంపించారు. ఇక జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: