వైరల్: రోల్స్ రాయిస్ కార్ లను ఎలా తయారు చేస్తారో తెలుసా..?

Divya
బ్రిటిష్ లగ్జరీ ఆటోమొబైల్ తయారీదారు గా గుర్తింపు పొందిన రోల్స్ రాయిస్ మోటార్స్ లిమిటెడ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది.. 2003వ సంవత్సరంలో సొంత ప్రయోజనం కోసం నిర్మింపబడిన ఈ సంస్థ ఆ తర్వాత ఉత్పత్తి కేంద్రాలుగా నిర్వహించి, 2003వ సంవత్సరం నుంచి రోల్స్ రాయిస్ బ్రాండ్ మోటార్ కార్ల ను ప్రత్యేకంగా తయారు చేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ సంస్థ యునైటెడ్ కింగ్ డమ్ లో 1998వ సంవత్సరంలోనే స్థాపించబడింది. ఇక ఈ కారును ఎలా తయారుచేస్తారు..? అనే సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరు లో కలుగుతోంది.. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రోల్స్ రాయిస్ కారును మొత్తం 44 వేల కలర్ లతో తయారు చేస్తారట. అంతేకాదు ఈ రోల్స్ రాయిస్ కార్ మొత్తం హ్యాండ్ మేడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే చేతులతో డిజైన్ చేసి  రూపొందిస్తారు అట. అయితే ఈ కారును తయారు చేసేటప్పుడు మొత్తం ఇరవై మూడు రకాల కలర్ కోటింగ్ లు చేస్తారు. కేవలం ఆ కోటింగ్ వేసిన బరువే  43 కేజీలు ఉంటుందట. ఈ రోల్స్ రాయిస్ కంపెనీలో ఒక వ్యక్తి చాలా  ఫేమస్. ఆయనే మార్క్ కోట్.. ఈయన కార్ పై  డిజైన్ లైన్స్ గీస్తూ ఉంటారు.. ప్రజెంట్ ప్రపంచం మొత్తంలో ఈయనొక్కడే ఇంత ఫర్ఫెక్ట్ గా డిజైన్ లైన్స్ గీస్తూ ఉంటారు.
ఇక ఈయన పని చేస్తున్నందుకు సంవత్సరానికి 58  వేల డాలర్లను వేతనంగా తీసుకుంటున్నాడట. అంటే మన భారత దేశ కరెన్సీ ప్రకారం 43 లక్షల రూపాయలు అన్నమాట. ఈయన కోచ్ లైనర్ గా రోల్స్ రాయిస్ లో పనిచేస్తున్నారు. ఒకవేళ ఈయన  చనిపోతే రోల్స్ రాయిస్ పరిస్థితి ఏమిటో ఊహించడానికి కూడా కష్టం అనిపిస్తోంది కదా..! రోల్స్ రాయిస్ లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే , కస్టమర్లకు నచ్చిన విధంగా ఎవరికి నచ్చినట్టు రీతిలో వారికి ఈ రోల్స్ రాయిస్ కార్ ను తయారు చేసి ఇస్తారు. అందుకే ప్రపంచంలో చాలా మంది ఈ రోల్స్ రాయిస్ కార్ లకు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: