వైరల్ వీడియో : తాబేలు ఎంత క్రూరంగా మారిందేంటి?

praveen
ప్రస్తుతం ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అందులో కొన్ని శాకాహారులే అయితే మరికొన్ని మాంసాహారులు. ఇలా శాకాహారులు అయిన జీవుల్లో  మొదటగా వినిపించే పేరు తాబేలు.  నీటిలో నేలపై బ్రతికే ఈ జీవి ఎప్పుడు గడ్డి ఆకులు అలములు తింటూ బ్రతుకుతూ ఉంటుంది. మాంసం జోలికి అస్సలు పోదు.ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక వీడియో చూస్తే మాత్రం కేవలం మనుషులకే కాదు అటు శాకాహారి అయిన తాబేలు కూడా మాంసాహారి గా మారిపోయి క్రూరంగా ప్రవర్తిస్తుంది అన్నది అర్ధమవుతుంది.

 రోజురోజుకు మనుషుల్లో మార్పు  వస్తున్నట్లు గానే అటు అడవుల్లో బ్రతికే ఎన్నో జీవరాసుల మనుగడ లో కూడా మార్పులు వస్తున్నాయి అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆకులు అలములు తింటూ బ్రతికి ఇక శాకాహారి అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే తాబేలు ఇక్కడ ఎంతో క్రూరంగా ప్రవర్తించింది. ఏకంగా ఒక పక్షి పిల్లలను దారుణంగా ప్రాణాలు తీసేసింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ ఇన్నాళ్ళ వరకు తాబేలు అంటే నిదానంగా ఉండి సాధు స్వభావం కలిగిన జీవి అని అనుకున్నాం కానీ తాబేలు కూడా ఇంత వైల్డ్ గా మారిపోయింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

 ఆఫ్రికా లోని సెచెల్స్ దీవుల సముదాయం లోని ఫ్రెగ్రేట్ ఐలాండ్ లో  ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ దాదాపు మూడు వేలకు పైగా తాబేలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ఒక భారీ ఆడ తాబేలు ఇలా క్రూరంగా ప్రవర్తించింది. అక్కడ ఎగురుతూ కనిపించిన ఒక పక్షిపిల్ల పై కన్నేసింది. చిరుతపులి మాటేసినట్లుగా ఇక ఆ పక్షిపిల్ల వైపు దూసుకు పోయింది. అప్పుడే రెక్కలు వస్తున్నా పక్షిపిల్ల ఎగిరి తప్పించుకోలేక పోయింది. దీంతో తాబేలు ఒక్కసారిగా నోటకరిచి దాని ప్రాణాలు తీసింది. రెచ్చెల్స్ తాబేలు  ఈ మధ్య కాలంలో ఇలా ప్రవర్తించి ఉండొచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: