ఎట్టకేలకు రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూర్..!

Divya
నీలిచిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కు.. బెయిల్ మంజూరు చేసింది ముంబై కోర్ట్. అందుకు 50 వేల రూపాయలను జరిమానా విధించి, బెయిల్ మంజూరు చేసింది. ఇక రాజ్ కుంద్రాను జూలై 19వ తేదీన అరెస్టు చేయగా.. అతనిపై భారతీయ సమాచార సాంకేతిక చట్టంలోని ఉండేటువంటి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు రాజ్ కుంద్రా. ఇక ఇప్పుడు బెయిల్ లభించింది ఈయనకు.

ఇక దాదాపుగా రెండు నెలల తర్వాత బెయిల్ మంజూరు కావడంతో బయటికి రానున్నారు. 50 వేల రూపాయలు జరిమానా విధిస్తూ,  ముంబై హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పోర్న్ గ్రఫీ కేసులో ఈయన మీద 1400 పేజీల ఛార్జీషీటును నమోదు చేశారు ముంబై పోలీసులు. ఇక రాజ్ కుంద్రా దేశం విడిచి పారి పోతాడన్న  ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఎన్నో సార్లు బెయిల్ కి ప్రయత్నించినా, నిరాకరించబడినట్లుగా కోర్టు తెలియజేస్తోంది. అందుకోసం ఆయన పాస్ పోర్ట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారట.

ఇక అతను ఒక యాప్ ను బాగా పాపులర్ చేసుకోవడం కోసమే రాజ్ కుంద్రా  ఈ ప్లాన్ చేశాడు అన్నట్లుగా సమాచారం. అందుకోసమే ఈయన 119 అశ్లీల చిత్రాలను నిర్మించినట్లు సమాచారం. ఇక వీటిని దాదాపుగా..8.85 కోట్ల రూపాయలకు అమ్ముకునే విధంగా ప్లాన్ చేసినట్లు చార్జిషీట్ లో అధికారులు తెలియజేశారు. ఇక రాజ్ కుంద్రా మొదటి యాప్ బ్యాన్  అవ్వగా.. ఇక రెండవ యాప్ ను తయారు చేసేందుకు డిజిటల్ మీడియాను ఉపయోగించుకున్నాడు.
ఇక తను ఈ కేసులో  ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత,  అతను ఆ యాప్ ను సీక్రెట్ గా ఉంచేందుకు ప్రయత్నం చేశారని, అలా కుదరకపోవడంతో ఆ వీడియోస్ అన్నింటినీ  డిలీట్ చేసి తనను రక్షించుకునేందుకు ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ముంబై పోలీసులు చార్జిషీట్ లో తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: