ఆయుష్షు పెంచే ఆరోగ్య సూత్రాలివే..!

Divya
జీవితం ఒక అందమైన ప్రపంచం.. ఈ ప్రపంచంలో జీవితాన్ని అత్యంత సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.. కానీ ఆయుష్షు అనేది ఎవరికి ఎంత కాలం ఉంటుంది అనేది నిర్ణయించడం చాలా కష్టం. ఇకపోతే జపాన్లోని ఒక పెద్దావిడ 118 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆమె ఇంకా జీవించే ఉన్నారు.. 1903లో పుట్టిన ఈమె ఇప్పటికీ తన జీవితాన్ని ఎంతో ఫిట్ గా, సంతోషంగా కొనసాగిస్తోంది.. వంద సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఇటీవల ఎవరైనా ఉన్నారు అంటే అది ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ వంటి దేశాల పేర్లు ముందు ఉంటాయి కానీ భారతదేశం అనే పేరు బహుశా ఎక్కడా వినిపించదో ఏమో..ఒకవేళ వినిపించినా భారతదేశం మొత్తం కలిపిన ఒకరో ఇద్దరో మాత్రమే వంద సంవత్సరాలు పైబడి జీవించి ఉంటారు అని చెప్పడంలో కొంచెం సంకోచం ఎదురవుతుంది..

ఇక భారతదేశంలో ఎందుకు వంద సంవత్సరాలు దాటి మనుషులు జీవించడం లేదు.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతూ వుంటుంది.. మనం జీవించి జీవనశైలి అయినా కావచ్చు.. తీసుకునే ఆహారం అయినా కావచ్చు.. దేని  ప్రభావం అయినా .. అది మన ఆయుష్షు పైన పడుతుంది అనే విషయం చాలామంది మరిచిపోతున్నారు.. ఇటీవల ఒక పెద్దాయన 125 సంవత్సరాలు దాటిన తర్వాత ..నాకు కరోనా వాక్సిన్ వేయండి అంటూ సెంటర్ కి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.. ఉన్నవారంతా షాక్ ద లైఫ్ ఓల్డ్ సిటిజన్.. ది ఓల్డెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్ బిగ్ వ్యాక్సినేషన్ అంటూ ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇకపోతే ఆయుష్షు పెరగాలి అంటే.. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారం తప్పక ఉండాలి.. అంతేకాదు చుట్టూ ఉండే ప్రాంతాలు కాలుష్య రహితంగా ఉండడానికి, మన వంతు సహాయం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, దైవ స్మరణ చేయడం , తెలిసిన నలుగురు వ్యక్తుల తో మాట్లాడడం వంటి పనుల వల్ల ఆయుష్షు పెరుగుతుంది అని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. అంతే కాదు నిత్యం వీలైనంతవరకూ యోగ , ఎక్సర్ సైజ్ చేయడంతోపాటు మానసికంగా సంతోషంగా ఉండడం, ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేసినప్పుడు మృత్యుదేవత మన దరిచేరదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: