శభాష్ రజని

Vennelakanti Sreedhar
శభాష్ రజని
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఎందరినో అక్కున చెర్చుకుంది. నిత్యం వేలాది మంది అభాగ్యులు పొట్ట చేత పట్టుకొని భాగ్యనగారనికి వస్తుంటారు. వివిధ మతాలు, కులాలు,  జాతుల సమ్మెళనం ఈ మహానగరం. ఇక్కడి భాష యాస ప్రత్యేకం భారత దేశంలో ఎన్ని కులాలు ఉంటాయో, ఎంత వైవిధ్యం ఉంటుందోౌ అంతా కూడా హైదరాబాద్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఒక మినీ భారత్.  ఇక్కడి జీవన చిత్రం  విచిత్రంగా ఉంటుందని చెప్పే బతుకు చిత్రం ఇది. జిహెచ్ ఎంసిలో కార్మికుల జీవితాలను బయటి ప్రపంచానికి తెలియజెప్పే యత్నం
నిరుపేద వ్యవసాయ కూలీల బిడ్డ రజని. సగటు ఆడపిల్లలాగే ఆమె జీవితం గురించి ఎన్నో కలలు కన్నది. మంచి ఉద్యోగం పొందాలని ఆశించింది. అమ్మా,నాన్నల కష్టాలను తగ్గించాలను కుంది. ఇది ఏమీ అత్యాస కాదు కదా ? పీజీ వరకు ఆటంకాలు లేకుండా చదివి. ఎమ్మెస్సీ ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి అర్హత కూడా సాధించింది. త్వరలో డాక్టరేట్ అవుతుందని ఆమె స్నేహితులు భావించారు.
అదే సయయంలో పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు. భర్త అనారోగ్యంతో ఆమె కథ అడ్డం తిరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, అత్త, భర్త బాగోగులు చూసుకుంటూనే…పోటీ పరీక్షలు రాస్తూ, ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఫలితం లేదు.
బతుకుతెరువు కోసం సంతల్లో కూరగాయలు కూడా అమ్మింది. ప్చ్‌ అది కూడా కలిసి రాలేదు.
ఇక గత్యంతరం లేక…  ఉదర పోషణార్దం జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేరింది.
పది వేల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఎమ్మెస్సీ చదివి స్వీపర్‌గా పనిచేస్తున్నందుకు రజని సిగ్గుపడటం లేదు.
‘వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే అయిదుగురం బతకాలి. జీవితంలో చీకటి మాత్రమే శాశ్వతం కాదని, వెలుగు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా.’ అంటుంది రజని.
హైదరాబాద్‌ జిలుగు వెలుగుల్లో కనిపించని ఈ చీకటి కోణాన్ని కోట నీలిమ అనే పాత్రికేయురాలు బయట పెట్టారు, ఆమో జీవిత గాథకు దృశ్య శ్రవణ రూపం ఇచ్చారు.  అది  సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: