Viral : ప్రియుడి నియమాలకు లోబోదిబోమన్న ప్రేయసి..

Purushottham Vinay
ఒక రిలేషన్ లో అబ్బాయికి అమ్మాయికి అండర్ స్టాండింగ్ ఉండటం అనేది చాలా ముఖ్యం.లేదా అబ్బాయికి నచ్చినట్టు అమ్మాయి ఉండటం అమ్మాయికి నచ్చినట్టు అబ్బాయి ఉండాలి.ఇక ఈ రెండు లేనట్లయితే వారి రిలేషన్ కొనసాగించడం కష్టమవుతుంది. ఇక అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థి అయిన కరోలిన్ విషయంలో అదే జరిగింది, ఆమె బాయ్‌ఫ్రెండ్ రిలేషన్ లో ఉండటానికి 11 నియమాలు ఆమె పాటించాలని కండిషన్స్ పెట్టాడు. ఇక ఆ అమ్మాయి తన ప్రియుడు ఇచ్చిన 11 నియమాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక వాటికి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోయారు. కరోలిన్ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు తన ప్రియుడి కంట్రోలింగ్ స్వభావం గురించి సోషల్ మీడియాలో మాట్లాడిందని మిర్రర్ యుకె నివేదించింది. కరోలిన్ ఈ నియమాల స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నది. ప్రియుడి నిబంధనల ప్రకారం ఆ మహిళ బాయ్‌ఫ్రెండ్ ఆమెను తినడం, తాగడం ఇంకా టైట్, గట్టి బట్టలు ధరించడాన్ని నిషేధించాడు.

 అలాగే ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా  ఆల్కహాల్‌ను తాగనని చెప్పాడు.ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ కండిషన్స్ మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటుంది.ఇంకా కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ ఆమెను తను కాకుండా వేరే ఏ అబ్బాయిలతో మాట్లాడకూడదని ఇంకా కలవకూడదని నిషేధించాడు. ఇంకా అతను ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ఎప్పటికీ తీసివేయకూడదని అతను ఒక నిబంధనలో చెప్పాడు. వీటితో పాటు, కరోలిన్ రాత్రి 9 గంటలకు తన హాస్టల్ గదికి తిరిగి రావాలని నియమాలు సూచించాడు. క్రాప్ టాప్ లేదా టైట్ డ్రెస్ ధరించడానికి లేదా పార్టీలకు హాజరు కావడానికి కూడా ఆమెకు ఎలాంటి అనుమతి కూడా లేదు.కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ చేసిన నియమాలను రోజూ ఆమె పాటించాల్సి ఉంటుంది. ఇక ప్రియుడి కండిషన్స్ తో లబోదిబొమంటున్నా కరోలిన్ అతనితో ప్రేమ సంబంధాన్ని ముగించాలని ఆలోచిస్తున్నానని కానీ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదని సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: