తమన్నా అలా చేసినందుకు ఫ్యాన్స్ ఏడుస్తున్నారు!
అసలు మాస్ట్రో హిట్ టాక్ తెచ్చు కోవడానికి కారణం తమన్నా నెగిటివ్ నటననే అని సని విశ్లేషకులు అంటున్నారు. అయితే తమన్నా నెగిటివ్ నటనా బాగున్న తన ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోవడం లేదు. తమ అభిమాన హిరోయిన్ ఇలా కిల్లర్ ల కనపడటం తమకు ఏ మాత్రం నచ్చటం లేదని తమ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కిల్లర్ పాత్ర ను తట్టు కోలేని తమన్నా ఫ్యాన్స్ చాలా మంది ఏడుస్తున్నారు. ఈ జాబితా లోని ఒక చిన్నారి వెక్కి వెక్కి ఎడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమన్నా ఆంటి చాలా మంచిది.. ఇలా అందరినీ ఎందుకు చంపుతుంది అంటూ ఆ చిన్నారి ఏడుస్తున్న వీడియా చాలా ముచ్చట గా ఉంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే మాస్ట్రో సినిమా డైరెక్టర్ మేర్లపాక గాంధీ చిన్న కుతూరు లిపి.
ఆ చిన్నారి ఏడుస్తున్న ఉన్న వీడియో ను దర్శకుడు మేర్ల పాక గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో పై హిరో నితిన్ కూడా స్పందించాడు. ఈ వీడియో ను ట్విట్టర్ లో తమన్నా కు ట్యాగ్ చేసి ఎందుకు మీ ఫ్యాన్స్ ను ఏడిపిస్తున్నావ్ తమన్నా. నేను ఈ రోజు చూసిన క్యూట్ వీడీయో ఇది. ఈ చిన్నారి మేర్లపాక గాంధీ చిన్న కూతురు లిపి అంటు పోస్టు చేశాడు. ఈ ట్విట్ చూసిన తమన్నా తప్పకుండా ఈ చిన్నారికి ఒక హగ్ ఇవ్వాల్సిందే అని కామెంట్ చేసింది. ఏది ఏమైనా తమన్నా నెగిటివ్ పాత్ర చేయడంతో చాలా మంది ఫ్యాన్స్ ఏడుస్తున్నారు.