చదువు మానేయమని చెబితే.. స్టేట్ రాంక్ సాధించింది..!!

Divya
అసలే నిరుపేద కుటుంబం.. రెండెకరాలే వారి జీవనాధారం.. పైగా ముగ్గురు ఆడపిల్లలు.. వీరి పరిస్థితి వర్ణనాతీతం.. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ దంపతులకు ఏకంగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించడంతో వీరి చదువులను సాగించలేక చదువు మానేయమని చెప్పారట.. అమ్మాయి అంగీకరించలేదు.. కష్టపడి చదివి తనలో ఉన్న ప్రతిభను బయటకు పెట్టి పది , ఇంటర్ మంచి మార్కులతో పూర్తి చేసింది. డీ ఈ ఈ సెట్ ఎగ్జామ్ రాసి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది గడీల అనోధ.. ఇక ఈమె గురించి మనం తెలుసుకుందాం..

కొమురం భీం జిల్లా.. కాగజ్ నగర్ మండలంలోని బోడేపల్లి అనే గ్రామం.. తిరుపతి - రాజేశ్వరి దంపతులకు ఈ అమ్మాయి పుట్టింది.. ఇక పోతే ఈమె సాధించిన విజయం గురించి ఆమె మాటల్లోనే విందాం.. ఒక అక్క, చెల్లెలు తో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు.. అక్కకు వివాహం అయ్యింది.. పెళ్లికి చేసిన అప్పులే ఇంకా ఉన్నాయి.. నేను పొలం పనులకు చేదోడువాదోడుగా ఉంటానని , చదువు వద్దులే ఆపేయమని చెప్పారు నాన్న గారు. మా ఊర్లో ఎనిమిదో తరగతి వరకు మాత్రమే ఉంది. ఇక పదో తరగతి పూర్తి చేయాలి అంటే మా ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదవాల్సి ఉంటుంది.

శంకర రావు అనే ఒక మాస్టర్ సహాయంతో నాన్నను ఒప్పించాను.. 2019 వ సంవత్సరం లో పదవ తరగతిలో 9.3 గ్రేడింగ్ పూర్తిచేశాను. ఇక ఇంటర్ చదవాలి.. ప్రైవేట్ కళాశాలలో చేరాలి అంటే ఆర్థిక పరిస్థితి  సహకరించలేదు.. దాంతో మళ్లీ శంకర్రావు మాస్టారు మా నాన్నను ఒప్పించి , దహెగం లో ఉన్న కస్తూర్బా కళాశాలలో ఎంపీసీ పూర్తి చేశాను. అక్కడ కూడా 976 మార్కులు వచ్చాయి.. తెలంగాణలో ఉన్న కస్తూరిబా కళాశాలలో నాదే మొట్ట మొదటి ర్యాంకు.. పదిమందికి జ్ఞానం పంచాలి అంటే బోధనా వృత్తి చాలా మంచిది అని  తెలుసుకొని  ఇంటర్ తర్వాత డీ ఈ ఈ ప్రవేశ పరీక్ష రాద్దామని దరఖాస్తు చేశాను ..కానీ కోచింగ్ తీసుకునే అంత స్తోమత మాకు లేదు..

ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు సమయాన్ని కేటాయించి ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యాను..నేను కష్టపడిన దానికి ఫలితం లభించింది.. అంతే కాదు నా తల్లిదండ్రులకు కూడా సంతోషాన్నిచ్చింది.. నా కోరిక గెలిపించుకోవడం లో మొట్టమొదటి విజయం నేను సాధించాను.. ఇక ఉపాధ్యాయురాలునై  , సివిల్స్ దిశగా వెళ్లాలి అన్నది నా జీవిత లక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: