ఆ విద్యార్థినికి షాక్.. పొట్టి డ్రెస్ వేసుకుంటే ఇలా అయిందా..?

MOHAN BABU
 పరీక్షా గదిలోకి షాట్ వేసుకుని వచ్చినటువంటి ఒక విద్యార్థినిని ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి అధికారులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారి తల్లిదండ్రులు  ఆమెకు ఇంకొక డ్రెస్సు కొనడానికి పరుగులు తీశారు. ఇది గమనించినటువంటి కాలేజీ యాజమాన్యం కార్టైన్ ఇవ్వడంతో దానిని కప్పుకొని ఆ విద్యార్థిని పరీక్ష రాసింది. ప్రస్తుత విద్యార్థులు ఏదైనా పరీక్ష రాయాలంటే అనేక ఆంక్షలు అనేవి ఉంటాయి. విద్యార్థినిలకు అయితే  ఈ యొక్క ఆంక్షలు  అనేది ఇంకా దారుణంగా ఉంటాయి. ఒక్కోసారి  పెళ్లి జరిగినటువంటి మహిళలు కూడా తాలిని తీసి బయట పెట్టి పరీక్ష హాలులోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఈ నిబంధన అనేది ప్రతి ఒక్కరికి సమానంగా పనిచేస్తుంది. ఈ యొక్క నిబంధనలు ఇంకొన్ని రోజుల్లో మరింత కఠినంగా మారే అవకాశాలున్నాయి.

మనం ఏదైనా పరీక్ష రాయడానికి వెళ్లేటప్పుడు ఈ నిబంధనను మనం దృష్టిలో ఉంచుకోవాలి. కొన్ని విషయాలలో అధికారులు చాలా కఠినంగా వ్యవహరించడంతో ఒక్కోసారి అధికారులు వివాదాల పాల్ కూడా వస్తోంది. ఈ సందర్భంలోనే అస్సాం రాష్ట్రంలోని ఒక విద్యార్థినికి ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైంది అని చెప్పవచ్చు. అస్సాం  రాష్ట్రానికి చెందిన వ్యవసాయ యూనివర్సిటీ లో  ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ పరీక్ష రాయడం కోసం అదే రాష్ట్రానికి చెందినటువంటి  తమిళి అనే విద్యార్థిని స్థానిక గిరిజనంద చౌదరి కాలేజీలో పరీక్ష రాయడం కోసం వచ్చింది. అయితే ఈ అమ్మాయి మామూలు డ్రెస్ వేసుకొని రాకుండా షాట్ మరియు టీ షర్టు పై అక్కడికి వెళ్ళింది. అయితే ముందుగా ముందు ఎంట్రెన్స్ గేట్ లోకి అనుమతించిన అధికారులు ఎగ్జామ్ హాల్ లోకి మాత్రం నిరాకరించారు. ఏమైందని ఆ అమ్మాయి ప్రశ్నిస్తే  నీ డ్రెస్ కోడ్ బాగా లేదని చెప్పారు. షాట్ వేసుకుంటే ఎగ్జామ్ రాయడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీంతో అమ్మాయి ఆందోళన చెందింది. డ్రెస్ కోడ్ పై ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు అని  అయినా అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆమె నిరాకరించింది. వారిని గట్టిగా అడిగింది. అయినా అధికారులు మాత్రం వినలేదు. దీంతో అమ్మాయి చేసేదేమీలేక తన ఎగ్జామ్ కు ఆలస్యం అవుతుండడంతో తన తండ్రికి  సమాచారం అందించి  మరో డ్రెస్ తేవాలని తెలియజేసింది.

ఆయన వచ్చేసరికి లేట్ అవుతుందని తోటి విద్యార్థులు స్పందించి కాలేజీ లోనే ఒక కార్టైన్  తీసుకొనివచ్చి ఆమెకు ఆమెకు ఇవ్వడంతో  దానిని చుట్టుకొని ఎగ్జామ్ రాసింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిబంధనలతో చాలా చోట్ల విద్యార్థులు ఆందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా జాతీయస్థాయిలో పరీక్ష యొక్క విధి విధానాలపై స్పష్టమైన సమాచారాన్ని తీసుకురావడం వల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని మేధావులు  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: