వైరల్: ఈ విద్యార్థులకు ఖాతాలో ఏకంగా రూ.960 కోట్లు జమ.. ఎలా అబ్బా..!!

Divya
ఏంటి విద్యార్థుల ఖాతాలో ఏకంగా రూ.960 కోట్లా..? ఎవరు వేశారబ్బా..? ఇంతకు ఎక్కడ జరిగింది..? అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారా..? అయితే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా విద్యార్థులు ప్రభుత్వం నుంచి అందే స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం  విద్యార్థులు తమ అకౌంట్ ను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తమ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఇద్దరు విద్యార్థులు షాక్ కి గురయ్యారు.. వారి అకౌంట్ లోకి వచ్చి చేరిన అమౌంట్ ని చూసి వారికి దిమ్మతిరిగి నంత పని అయింది.. ఆ ఇద్దరు విద్యార్థుల ఖాతాలో ఏకంగా 960 కోట్ల రూపాయలు జమ అయినట్లు , వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో  కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

బీహార్ కు చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో గురుచంద్ర విశ్వాస్ మనీ విద్యార్థి ఖాతాలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు జమ అయితే,  అసిత్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థి ఖాతాలో 60 కోట్ల రూపాయలు జమ అయినట్లు విద్యార్థులు చెబుతున్నారు.. వీరిద్దరూ  బీహార్‌లోని కతిరాహ్ జిల్లా బగావురా గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి ఉత్తర్ బీహార్ గ్రామీణ బ్యాంకులో పాఠశాల సంబంధించిన అకౌంట్ ఉంది. పాఠశాలలో ఇచ్చే  యూనిఫారం ల  ఫీజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తమ అకౌంట్లలో డిపాజిట్ చేసిన డబ్బు గురించి తెలుసుకోవడానికి .. వీరిద్దరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన , అక్కడ వున్న  సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ కు వెళ్లారు.
వీరి అకౌంట్లో జమ అయిన డబ్బులు చూసి విద్యార్థులు షాక్ అయ్యి వెంటనే బ్యాంకు మేనేజర్ ను సంప్రదించారు. దీంతో బ్యాంకు మేనేజర్ మనోజ్ గుప్తా కూడా తీవ్రంగా ఆశ్చర్యానికి గురయ్యారు. డబ్బును విత్ డ్రా చేసుకోకుండా ఆ విద్యార్థులను  నిలువరించారు. ఆ తర్వాత సంబంధిత సమాచారాన్ని పై అధికారులకు వెల్లడించారు. సాంకేతిక తప్పిదాల కారణంగా ఈ విధంగా జరిగి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: