చివరకు పెళ్లాడారు... ఆపై ఏం జరిగింది?

Vennelakanti Sreedhar
చివరకు పెళ్లాడారు... ఆపై  ఏం జరిగింది?
ఒకటి కాదు, రెండు కాదు ...  పదేళ్ల పాటు సహజీవనం చేసిన జంట  ఎట్టకేలకూ ఒకటయ్యారు.  ఈ ప్రేమ వివాహం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... కేరళ రాష్ట్రం పాలక్కాడ్  సమీపంలోని విథన్ సారే ప్రాంతంలో రెహమాాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఒకే గది ఉన్న పాతపూరిల్లు అతని నివాసం.  అటాచ్డ్ బాత్రూం కూడా లేదు. సంక్షిప్తంగా అతని నివాసం వివరాలు ఇవి. అతను సుజాత అనే మహిళను గాఢంగా ప్రేమించాడు.  తమ ప్రేమ విషయాన్ని వారిద్దరూ తల్లితండ్రులకు తెలిపారు. సహజంగానే ఇరు పక్షాల వైపు నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇది జరిగి పదేళ్లవుతోంది. కాకపోతే అక్కడే  ట్విస్టుంది. రెహమాన్ తన ప్రేయయసి సుజాతను తీసుకు వచ్చి తాను నివాసం ఉన్న గదిలో ఉంచాడు. ఇద్దరూ సహజీవనం చేయసాగారు.  ఈ విషయం చుట్టుపక్కల వారికి కూడా పదేళ్లుగా తెలియదు. ఆ ఊరిలోని వాారందరూ రెహమాన్ ఒక్కడే ఆ పాత గదిలో ఉంటున్నాడని భావించారు. రహస్యంగా వారి సహజీవనం దశాబ్దకాలం పాటు సాగింది. బుధవారం రోజు వారిద్దరూ  పాలక్కాడ్ లోని సబ్-రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి వివాహం చేసుకున్నారు. దీంతో  వారి అజ్ఞాత సహజీవం వెలుగు చూసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వివాహ సమయంలో రెహమాన్ సంప్రదాయబద్దమైన ధోవతిని ధరించారు. ఆమె  సాధాారణ దుస్తులను ధరించింది. తాను ప్రస్తుతం  మరింత సంతోషంగా ఉన్నానని వివాహా నంతరం సుజాత మీడియా కు తెలిపారు.
వివాహ కార్యక్రమానికి హాజరైన  స్థానిక ఎం.ఎల్.ఏ కె. బాబు మాట్లాడుతూ, ఈ నూతన జంటకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ప్రకటించారు. వివాహానంతరం ఆ జంట  అక్కడ ఉన్నవారందరికీ విఠాయిలు పంచిపెట్టారు. ఆమెను తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. ఆమె గదిలో ఉన్నట్టు తెలియదన్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకయినా గది నుంచి వెలుపలకు రావాల్సి ఉంటుందని,  కానీ అలాంటిదేమీ జరగ లేదన్నారు. గదికి ఒక కిటికీ ఉందని, రాత్రీ వేళ ఆమె ఆ కిటికీ నుంచి వెలుపలికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని ఉండవచ్చునేమో ? అని ఆశ్చర్యంగా తెలిపారు.
అయితే రెహమాన్, సుజాత ల ప్రేమ కథ సుఖాంతమైందా ? లేదు... మరేం జరిగింది ? కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటన పై తీవ్రంగా స్పందించింది. ఒక మహిళను నిర్భందించడం నేరమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది.  ఈ ఘటన వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని పోలీసులను అదేశింంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: