వైరల్ వీడియో : బిగ్ బాస్ నుంచే ఫ్రెండ్స్ తో మాట్లాడిన షణ్ముఖ్ ?

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికి చూపును ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ తెలుగు బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది బిగ్ బాస్. ఇటీవలే  బిగ్ బాస్ 5వ సీజన్ మొదలైంది. దీంతో ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈసారి ఎంతో ఫేమస్ సినీ సెలబ్రిటీలు అటు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కాస్త బుల్లితెర ప్రేక్షకులందరికీ మరింత ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  తనదైన శైలిలో బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు షణ్ముఖ్ జస్వంత్.

 కాగా సెప్టెంబర్ 16వ తేదీన షణ్ముఖ్ జస్వంత్ బర్త్ డే.. ఒకవేళ షణ్ముక్   బయట ఉండి ఉంటే స్నేహితులందరి తో ఎంతో గ్రాండ్గా పార్టీ చేసుకొని బర్త్ డే వేడుకలు చేసుకునేవాడు.  ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోయాడు. అయితే అటు బిగ్బాస్ లో కూడా  నిర్వాహకులు ఒక కేక్ లోపలికి పంపించి బర్త్ డే వేడుకలు చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. కానీ బయట ఉన్న స్నేహితులు షణ్ముఖ్ జస్వంత్ పక్కన లేకపోవడంతో కాస్త ఫీలవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల షణ్ముఖ్ జస్వంత్ స్నేహితులు వినూత్నంగా ప్రయత్నించారు. ఏకంగా బిగ్ బాస్ హౌస్ సెట్ ముందు కేక్ కోసి గట్టిగా అరుస్తూ షణ్ముఖ్ జస్వంత్ బర్త్ డే విషెష్ తెలిపారు.

 అయితే అటు బిగ్బాస్ హౌస్ నుంచి కూడా షణ్ముఖ్ జస్వంత్ స్నేహితులతో మాట్లాడటం గమనార్హం. అదేంటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఉన్న స్నేహితులతో మాట్లాడటం ఎలా కుదురుతుంది.. ఎవరికీ తెలియని అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా..  అలాంటిది ఏమీ లేదు బిగ్ బాస్ సెట్ దగ్గర ఉన్న ఇంటి నుంచి స్నేహితులు షణ్ముఖ్ జశ్వంత్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్ డే అంటూ గట్టిగా అరచి చెప్పారు.  ఇక అంతలో బిగ్ బాస్ హౌస్ లో నుంచి థాంక్యూ సోమచ్ అంటూ షణ్ముఖ్ జస్వంత్ గట్టిగా అరిచి రిప్లై ఇచ్చాడు. ఇక ఇది విన్న స్నేహితులు ఎంతగానో సంబరపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: