వైరల్: ఇకపై మగవారి తోడు లేకుండా బయటకు వెళితే మరణమే..!

Divya
ఆఫ్ఘనిస్తాన్ లోని పరిస్థితులు ప్రతిరోజు కి దిగజారిపోతున్నాయి. తమ పాలనలో నేరాలు చేస్తే ఏ విధంగా శిక్షణ వేయాలో ప్రకటించారు తాలిబన్లు. దొంగతనం చేసినటువంటి వారికి రెండు చేతులు నరికి వేస్తామని బాగా స్పష్టంగా తెలియజేశారు. ఇక స్వలింగపర్కులకు.. రాళ్లతో కొట్టి చంపే చట్టం అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక అంతే కాకుండా నేరాలకు శిక్ష విధించే ముందు.. ఎవరినైనా నలుగురు సాక్షులను విచారించి, ఒకేసారి ఒక సాక్ష్యాన్ని ముగ్గురు తేడా ఉంటే శిక్షను రద్దు చేస్తామని తెలియజేశారు.
ఇక అంతేకాకుండా శిక్షణ పై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని తెలియజేసింది. ఇక మహిళలకు మగవారు తోడు లేకుండా బయటికి వస్తే వారికి కొరడా దెబ్బలు తప్పవని హెచ్చరిస్తోంది. ఇలాంటి కఠినమైన రూల్స్ తో ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తిరిగి 25 ఏళ్ల కిందకు వెళ్లి పోయింది అని చెప్పవచ్చు. అక్కడున్న మహిళలు మేము సాధించుకున్న అటువంటి హక్కులను కోల్పోయాము అన్నట్లుగా బాధతో తెలియజేస్తున్నారు. దీంతో తాలిబన్లు ఏ మాత్రం మార్పు రాలేదని వాళ్ళు చేసే పనుల వల్ల కనిపిస్తోందని అక్కడ వున్నటువంటి కొంతమంది మహిళలు అంటున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటువంటి సైనికులను ఉరి తీసి, వారి శవాలను వేలాడదీసి వారి మీద కాల్పులు జరిపి తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటున్న ట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వంపై ప్రధాని ముళ్ళ పరార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈయనకు, వారికి  గొడవ జరగడంతో అక్కడ గాయపడినట్లు సమాచారం. ఇక తాలిబన్లు తమ ఆఫ్ఘనిస్తాన్ ను  స్వాధీనం చేసుకున్నామని తెగ ఎంజాయ్ చేస్తుంటే.. అక్కడ ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు  నరకయాతన అనుభవిస్తున్నట్లు.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తెలియజేసింది.
అందుచేతనే.. ఆఫ్ఘనిస్తాన్ పై సానుభూతితో అమెరికా, కెనడా వంటి దేశాలు బారి సహాయాన్ని ప్రకటించాయి. ప్రభుత్వ ప్రజలకు సహాయం చేసిన దేశాలకు ఆఫ్ఘనిస్థాన్లోని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: