వైరల్ వీడియో : అందరి ముందే వధువు కాళ్లు మొక్కిన వరుడు?

praveen
సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే.  వధూవరులు ఇద్దరూ కూడా బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటారు.  అయితే ఇలా పెళ్లి జరిగిన సమయంలో వధువు వరుడి కాళ్ళకి దండం పెట్టడం లాంటివి చూస్తూ ఉంటాం. ఇలా వరుడి కాళ్ళు మొక్కి  ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటుంది.  ఇలాంటివి అన్ని పెళ్లిళ్ల లో కూడా ఎంతో కామన్.  కానీ ఇక్కడ ఒక వరుడు చేసిన పని మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

 సాధారణం గా పెళ్లి తర్వాత వధువు వరుడి కాళ్ళకి మొక్కటం లాంటివి జరుగుతుంది  ఒకవేళ వరుడికి ఇలాంటి సాంప్రదాయాలు ఇష్టం లేకపోతే   కాళ్లు మొక్కుతున్న భార్యను నివారించడం వద్దు అని చెప్పడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం.  ఇక్కడ పెళ్లి చేసుకున్న ఓ యువకుడు వధువు కాళ్లు మొక్కడానికి వస్తూ ఉంటే వద్దు అని చెప్పాడు..  మరి ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా..  అయితే వధువు కాళ్లు పట్టుకుంటే వద్దు అని చెప్పిన వరుడు ఏకంగా అందరిముందే వధువు కాళ్ళమీద పడిపోయాడు.  దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగానే స్పందిస్తున్నారు అని చెప్పాలి.  ఇక ఈ వీడియో చూసిన కొంతమంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానమే అనే ఉద్దేశంతో వరుడు భార్య కాళ్ళ మీద పడ్డాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోవడం కోసమే ఇలా కొత్తగా ట్రై చేసాడు అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా వరుడు ఇలా అందరిముందే వధువు కాళ్ళు పట్టుకోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: