ధోని సిక్సర్ కి అందరూ అవాక్.. వైరల్ వీడియో?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండో దశ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. ఓవైపు క్వారంటైన్ లో గడుపుతూనే  మరోవైపు మైదానంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. దీంతో ఇక రెండవ దశ  ఐపీఎల్  ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా ప్రేక్షకులు అందరిలో కూడా ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే అందరి కంటే ముందు అటు చెన్నై సూపర్ కింగ్స్ టీం యూఏఈ చేరుకుంది అన్న విషయం తెలిసిందే. అందరికంటే ముందుగానే క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ మొదటి దశలో పేలవ ప్రదర్శన చేసి అభిమానులను నిరాశపరిచిన మహేంద్రసింగ్ ధోని ఇక ఈ రెండవ దశలో ఎలా రాణించ బోతున్నాడు అన్నదానిపైనే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆలోచనలో పడిపోయారు. అభిమానులందరిలో మరింత జోష్ నింపడానికి అటు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు అటు జట్టు ప్రాక్టీస్ వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటం గమనార్హం.  ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఒక వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది.

 ఇక ఈ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా మహేంద్రసింగ్ ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ప్రాక్టీస్ లో భాగంగా అదిరిపోయే షాట్లు ఆడుతూ ధోని ఇరగదీసాడు అనే చెప్పాలి. అయితే ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసిన వీడియో కి ఒక కామెడీ క్లిప్ ఆడియో ని జత చేసింది. దీంతో ఈ వీడియో కాస్త ఎంతో ఫన్నీగా మారిపోయింది. ధోని ఒక భారీ సిక్స్ కొట్టిన సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ ఆశ్చర్యపోయి ఆకాశం వైపు చూస్తూ ఉండడం మాత్రం అందరినీ ఎంతగానో నవ్విస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: