వైరల్ : ఫుట్ బాల్ ప్లేయర్స్ గా మారిన ఎలుగుబంట్లు.. అంతకు మించి..!
ఇటీవల కాలంలో ఎక్కువగా పక్షులు, జంతువులు, మనుషులు చేసే పనులు చేసి అందరిని బాగా ఆకర్షిస్తున్నాయి . ఇక ఈ వీడియోలని చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడంతో ఇవి కాస్త నెట్టింత సందడి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఫుట్ బాల్ ప్లేయర్స్ కు మించి ఎలుగుబంట్లు ఫుట్ బాల్ ఆడుతూ ఉండడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వింత ఘటన ఒడిశాలోని నబరంపూర్ జిల్లా సుఖీ గావ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది..
అక్కడ ఆ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఒక మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్నారు.. అకస్మాత్తుగా అక్కడికి రెండు ఎలుగుబంట్లు వచ్చాయి. ఇక వాటిని చూసిన యువకులు తమ ఫుట్ బాల్ ను అక్కడే వదిలేసి , అక్కడి నుంచి పరిగెత్తారు. అయితే ఎలుగుబంట్ల దృష్టికి బాల్ ఎంతో విచిత్రంగా అనిపించడంతో , కొద్దిసేపు ఆ బాల్ తో ఫుట్ బాల్ ఆడటం మొదలు పెట్టాయి. ఇక ఫుట్ బాల్ను అటూ ఇటూ కదుపుతూ.. మనుషుల్లాగే తమలో ఉన్న ప్రతిభను అందరికీ చూపించాయి. వీటి ఆటను చూసిన గ్రామ యువకులు భయం భయంగానే వీడియోలు చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో, ప్రస్తుతం ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి ఈ వీడియోలు. ఏది ఏమైనా ప్లేయర్స్ కు మించి ఫుట్ బాల్ ఆడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు.