మ‌ళ్లి క‌లిసిన‌ జెన్నిఫ‌ర్ లోపెజ్‌, బెన్ అప్లెక్

Dabbeda Mohan Babu
హాలివుడ్ న‌టుడు బెన్ అప్లెక్, పాప్ సింగ‌ర్ జెన్నిఫ‌ర్ లోపెజ్ మ‌ళ్లి ఒక‌టైయ్యారు. గ‌తం విడిపోయిన వీరు మ‌ళ్లీ క‌లిసి త‌మ అభిమానుల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు. త‌మ జంట మ‌ళ్లి క‌లిసిన విష‌యాన్ని పాప్ సింగ‌ర్ జెన్నిఫ‌ర్ లోపెజ్ తెలిపారు. త‌న 52 వ పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా లో ఆ జంట క‌లిసి ఉన్న పోటోల‌ను పోస్టు చేశారు. దీంతో వీరి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ అభిమాన న‌టి న‌టులు బెన్‌ఫ‌ర్ లు మ‌ళ్లి క‌లిసి త‌మ జీవితాన్ని పునఃప్ర‌రంభించ‌డాన్ని సంతోష‌మ‌ని పోస్టులు పెడుతున్నారు.

కాగ హాలివుడ్ పాప్ సింగ‌ర్ జెన్నిఫ‌ర్ లోపెజ్ న‌టుడు బెన్ అప్లెక్ లు 2002లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అనంత‌రం ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత 2003 లో వీరు ఇరువురు వివాహం చేసుకున్నారు. వీరు ఒక ఏడాది పాటు బాగానే ఉన్నా కొద్ది రోజుల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య విబేదాలు వ‌చ్చాయి. దీంతో 2004లో ప‌ర‌స్ప‌రం విడాకులు తీసుకున్నారు. డైవ‌ర్స్ త‌ర్వాత ఇద్ద‌రు న‌టులు వేరు వేరుగా పెళ్లి లు చేసుకున్నారు.   మార్క్ అంటోనిని పాప్ సింగ‌ర్ జెన్నిఫ‌ర్ లోపెజ్ వివాహం చేసుకుంది. అలాగే న‌టుడు బెన్ అప్లెక్ జెన్నిఫ‌ర్ గార్నెర్ ను పెళ్లి చెసుకున్నారు.

కొన్ని సంవత్స‌రాల త‌ర్వాత మార్క్ అంటోనికి జెన్నిఫ‌ర్ లొపెజ్ విడాకులు ఇచ్చింది. అలాగే బెన్ అప్లెక్ కూడా జెన్నిఫ‌ర్ గార్నెర్ కు డైవ‌ర్స్ ఇచ్చాడు. వీరి ఇరువురి విడాకుల త‌ర్వాత కొన్ని రోజులు ఒంట‌రిగా ఉన్నారు. త‌ర్వాత జెన్నిఫ‌ర్ లోపెజ్, బెన్ అప్లెక్ మ‌ళ్లి రిలేష‌న్ షిప్‌లో ఉండాల‌ని భావించారు. దీంతో వారు ఒక్క‌టైయ్యారు. వీరు మొద‌టి సారి గ‌త వారం వెనిస్ లిడో న‌గ‌రంలో జరిగిన 78వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో వీరు ఇద్ద‌రు ఒకే కార్పెట్ పై న‌డిచి అల‌రించారు. అనంత‌రం తాజా సోమ‌వారం మెట్ గాలా 2021 లో క‌నిపించారు. ఈ సంద‌ర్భంగా వీరు మాస్క్ పై నుంచి ముద్దు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: