ల‌వ‌ర్ కావాల‌ని ఎవ‌రికి లెట‌ర్ రాసాడో తెలుసా?

Dabbeda Mohan Babu
సాధార‌ణంగా ల‌వ్ చేయాల‌ని అమ్మాయిల‌కు లెట‌ర్ రాస్తారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు త‌మ ప్రాంతంలో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఉత్త‌రాలు వ‌స్తాయి. కానీ ల‌వ‌ర్ కావాల‌ని ఎమ్మెల్యే ల‌కు లెట‌ర్ రాస్తారా.. అవును అండి.. ప్ర‌జాప్ర‌తినిధికి ఒక లెట‌ర్ వ‌చ్చింది. అది ఎంటో చూసి ఆ ఎమ్మెల్యే తోపాటు వార్త విన్న వారంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. త‌న‌కు ల‌వ‌ర్ కావాల‌ని ఒక యువ‌కుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే కు లెట‌ర్ రాసాడు. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడు రాసిన లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైరెల్ గా మారింది. అలాంటి విచిత్ర మైన సంఘ‌ట‌న మ‌హారాష్ట్రలో జరిగింది.

మా గ్రామంలో తాగుబోతుల‌కు.. తిరుగుబోతుల‌కు ల‌వ‌ర్లు ఉన్నార‌ని.. త‌న‌కు కూడా ఒక ల‌వ‌ర్ ను చూసిపెట్టండ‌ని ఆ ప్రాంత ఎమ్మెల్యేకు లెట‌ర్ రాసాడు. మ‌హారాష్ట్ర లోని చంద్ర‌పూర్ లోని భూష‌ణ్ జామువంత్ అనే యువ‌కుడు ఈ లెట‌ర్ ను ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుభాష్ థోతుకు రాశాడు. ఈ లెట‌ర్ లో తాన ఊరిలో చాలా మంది అమ్మాయిల‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేశాను. కానీ ఎ ఒక్క‌రూ కూడా నా ల‌వ్‌ను అంగీక‌రించ‌లేదు. తాగుబోతుల‌కు తిరుగుబోతుల‌కు ల‌వ‌ర్లు ఉన్నారు. కానీ నాకు ఎవ‌రూ లేర‌ని ఆ లెట‌ర్ లో రాశాడు. నాకు ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని వెతికి పెట్టాల‌ని ఆ లెట‌ర్ లో వ్రాశాడు.

కాగ ఈ లెట‌ర్ పై ఎమ్మెల్యే సుభాష్ థోతు స్పంధించారు. తాన రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అభ్య‌ర్త‌న‌ను చూడ‌లేద‌ని అన్నారు. ఈ లెట‌ర్ ను చూసి మొద‌ట ఆశ్చ‌ర్య ప‌డ్డాన‌ని అన్నాడు. కానీ ఆ యువ‌కునికి కౌన్సిలింగ్ అవ‌స‌ర‌మ‌ని భావించాన‌ని తెలిపారు. ఈ లెట‌ర్ రాసిన భూష‌ణ్ జామువంత్ కోసం త‌మ కార్య క‌ర్త లతో వెతికిస్తున్నాని అన్నారు. ఆ యువ‌కున్ని వెతికి ప‌ట్టుకుని జీవితం గురించి కౌన్సిలింగ్ ఇప్పిస్త‌న‌ని అన్నారు. జీవితం అంటే ల‌వ్ ఒక్క‌టే కాద‌ని.. ఆ యువ‌కునికి చెబుతాన‌ని ఆ ఎమ్మెల్యే అన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: