వైరల్ వీడియో : ఫుట్బాల్ మ్యాచ్ లో పిల్లి హల్ చల్?

praveen
ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ అటు మ్యాచ్ విచ్చేస్తున్న అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఒక్కసారిగా  స్టేడియం నుంచి సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి అభిమానులు పరుగులు పెడుతూ రావడం లాంటివి చూస్తూ ఉంటామ్. తమ అభిమాన క్రికెటర్ కలుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మాత్రం కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రేక్షకులు తీసుకువచ్చిన పెంపుడు జంతువులు సైతం మైదానంలోకి  ఎంట్రీ ఇచ్చి అటు అందరిని ముప్పుతిప్పలు పెట్టడం లాంటివి వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

 ఇటీవలే ఒక పెంపుడు కుక్క యజమానిని నుంచి తప్పించుకుని ఏకంగా క్రికెట్ మైదానంలోకి పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో ఎంత చక్కర్లు కొట్టిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెక్యూరిటీని మైదానం మొత్తం పరుగులు పెట్టించిన కుక్క చివరికి క్రికెట్ బంతిని అటు బ్యాట్స్మెన్  దగ్గర తీసుకువచ్చి వదిలేసింది. ఈ వీడియో వైరల్ గా మారగా.. ఐసీసీ ఏకంగాఈ కుక్కకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి హల్ చల్ చేసింది కుక్క కాదు పిల్లి.

 ఫుట్బాల్ మ్యాచ్లో పిల్లి నానా హంగామా సృష్టించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. యూఎస్ లోని మియామీ హార్డ్ రాక్ స్టేడియం లో ఎంతో ఉత్కంఠ భరితంగా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది  ఇంతలో అటు స్టేడియం పైన ఒక పిల్లి దర్శనమిచ్చింది. అది అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా స్టేడియం మీద నుంచి కిందకు పడబోయింది. ఇక అంతలో అక్కడున్న ఆడియన్స్ అందరూ అమెరికా జెండా సహాయంతో ఆ పిల్లని క్యాచ్ పట్టుకున్నారు. దీంతో ఆ పిల్లి ప్రాణాలతో బయట పడింది ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: