అబ్బాయికి డిగ్రీ లేదని నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయి... ?
ఇదంతా నమ్మి యువతికి చెప్పడంతో ఆమె కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. నిన్న అనగా ఆదివారం రోజున ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్ధం చెయ్యాలని అనుకున్నారు. అమ్మాయి ఇంటి దగ్గరే దీనికి సంబంధించిన ఆణి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాగో అమ్మాయి బంధువులకు ఇక్బల్ డిగ్రీ చదవలేదని తెలిసిపోయింది. అంతే కాకుండా ఈ విషయం అమ్మాయి వరకు వెళ్ళింది. ఈ కారణంతో సరిగ్గా నిశ్చితార్ధం రోజున పెద్దలందరి సమక్షంలో ఈ అబ్బాయి అబద్దం చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడు. డిగ్రీ కూడా చదవని ఈ అబ్బాయిని పెళ్లిచేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పింది.
తమను మోసం చేశారని ఇరు కుటుంబీకులు ఘర్షణ పడడంతో వారిలో ఒకరికి గాయాలయినట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న వైరా మండల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చూశారా వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ ఇక్కడ వీరు ఆడిన ఒక అబద్దానికి పెళ్లి కాస్తా పెటాకులయింది. పైగా బోనస్ గా కేస్ ఫైల్ అయింది. కాబట్టి ఇది అభివృద్ధి చెందుతున్న దేశం ఇక మోసగాళ్ల ఆటలు సాగవు.