సింహంపై హైనాల దాడి.. చివ‌రికి?

Dabbeda Mohan Babu
అడ‌వికి రాజు సింహం. ఎ జంతువునైనా చాలా సుల‌భంగా వేటాడేస్తుంది సింహం. సింహం ద‌గ్గ‌ర‌కు జంతువులు రావలంటే గ‌జ గ‌జ వ‌నుకుతాయి. సింహం వ‌స్తుంటే జంతువుల‌న్నీ ప‌రార్ అవుతాయి. కానీ ఒక హైనాల గుంపు సింహానికి భ‌య‌ప‌డ‌లేదు. అంతే కాదు ఎకంగా దాడి చేశాయి. నీ బ‌లం మా ముందు ఎంత అన్న‌ట్టు సింహానికి సింహానికే చుక్క‌లు చూపించాయి ఆ హైనాల గుంపు. ప్ర‌స్తుతం ఈ హైనాల దాడి విడీయో సోష‌ల్ మిడీయాలో వైర‌ల్ గా మారింది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ల‌క్ష‌ల మంది ఈ వీడియోను చూసారు.
కెన్యా దేశంలోని ఒలాపో అనే క్యాంప్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ వీడియో ప్ర‌కారం ఒక సింహం ఒంట‌రి గా ప‌డుకుని సేద తీరుతుంది. ఇంత లోనే అక్క‌డ కు హైనాల గుంపు వ‌చ్చింది.  అక్క‌డ సేద తీరుతున్న సింహాన్ని చూసి త‌మ‌కు ఈ రోజు త‌మ‌కు ఆహారం వ‌చ్చిన‌ట్టే అని సంబుర ప‌డ్డాయి. అక్క‌డ అడ‌వి కి రాజు అయిన సింహం అని ఏ మాత్రం ఆలోచించ‌లేదు. వెంట‌నే ఒంట‌రిగా ఉన్న సింహం పై హైనాల గుంపు ఎటాక్ చేశాయి. సింహం త‌ప్పించుకోవ‌డానికి ఎ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా చుట్టు ముట్టాయి.

చివ‌రికి హైనాల గుంపున‌కు బంగ‌పాటు ఎదురుకాక త‌ప్ప‌లేదు. హైనా లు దాడి చేసిన కొద్ది నిమిషాల‌లో మ‌రికోన్ని సింహాలు అక్క‌డికి చేరుకున్నాయి. సింహం పై దాడి చేసిన హైనాల‌న్నిటినీ త‌రమి త‌ర‌మి కోట్టాయి. చివ‌రికి హైన‌ల గుంపు సింహాన్ని విడిచి పెట్టాయి. ప్రాణాల‌తో ఉంటే చాల‌ని అక్క‌డి నుంచి దూరంగా పారిపోయాయి. ఈ వీడియో ను ఒక సంస్థ వారు ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వైరెల్ వీడియోను ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 6 ల‌క్ష‌ల మంది చూసారు. అంతే కాకుండా చాలా మంది ఈ వీడియో ను షేర్ చేస్తున్నారు. రెండు ల‌క్ష‌ల‌కు పైగా లైక్ లు కూడా వ‌చ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: